Tea Side Effects: ఖాళీ కడుపుతో టీ తాగితే కలిగే నష్టాలు ఇవే..!
Tea Side Effects: ఖాళీ కడుపుతో టీ తాగితే కలిగే నష్టాలు ఇవే..!
Tea Side Effects: భారతదేశంలో టీ ప్రియుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి కూడలిలో టీ స్టాల్ కనిపిస్తుంది. కొందరికైతే టీతోనే రోజు మొదలవుతుంది. మరికొందరికి మంచం మీద కళ్లు తెరవగానే టీ కావాలంటారు. అయితే పరగడుపున టీ తాగడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
1. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నవారు టీ తాగడాన్ని తగ్గించాలి. ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ప్రేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
2. గుండె సమస్య ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి. టీ తాగడం వల్ల రక్తపోటు సమస్యని ఎదుర్కోవలసి ఉంటుంది. దీని వలన గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదం ఉంటుంది.
3. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే అది మీ జీవక్రియపై స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఇది శరీరం జీవక్రియ రేటుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం నోటి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుందని గుర్తుంచుకోండి.