Tea Side Effects: టీ సైడ్‌ ఎఫెక్ట్స్ తెలిస్తే అస్సలు ముట్టుకోరు..!

Tea Side Effects: టీ సైడ్‌ ఎఫెక్ట్స్ తెలిస్తే అస్సలు ముట్టుకోరు..!

Update: 2022-09-11 03:28 GMT

Tea Side Effects: టీ సైడ్‌ ఎఫెక్ట్స్ తెలిస్తే అస్సలు ముట్టుకోరు..!

Tea Side Effects: దేశంలో టీ ప్రియులకు కొరత లేదు. ఇది లేనిదే రోజు ప్రారంభించడం చాలా కష్టం. టీ సిప్ చేయకుంటే చాలామంది తలనొప్పి, అలసటను ఎదుర్కొంటారు. ఇది తాజాదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ కొంతమందికి అధికంగా టీ తాగే విచిత్రమైన అలవాటు ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కప్పుల టీని తాగుతారు. టీని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. టీ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.

రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి..?

టీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని అందరికి తెలుసు. అయితే ఇది టీ ఆకుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు టీలో దాదాపు 60 mg కెఫిన్ ఉంటుంది. దీని ప్రకారం రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. మీరు రోజులో 4 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీ తాగితే ఇందులో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శాఖాహారం తీసుకునే వారికి టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

టీలో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా ఇది మైకముని కలిగిస్తుంది. కాబట్టి చాలా మంది ఆరోగ్య నిపుణులు టీని ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తారు. మీరు ఒక రోజులో 5 నుంచి 10 కప్పుల టీ తాగితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా ఛాతీలో మంట సమస్య ఏర్పడుతుంది. టీ మీకు తాజాదనాన్ని ఇస్తుంది. తద్వారా మీరు రోజుకి అవసరమైన పనిని టెన్షన్ లేకుండా చేయవచ్చు. కానీ నిరంతరంగా టీ తాగుతూ ఉంటే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.

Tags:    

Similar News