Beer: బీర్ తాగే అలవాటుందా.. అయితే ఈ సమస్యకి గురైనట్లే..!

Drinking Beer: మద్యం సేవించడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది.

Update: 2022-10-08 14:30 GMT

Beer: బీర్ తాగే అలవాటుందా.. అయితే ఈ సమస్యకి గురైనట్లే..!

Drinking Beer: మద్యం సేవించడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది. ఒక్కోరకాన్ని బట్టి ఆల్కహాల్ పరిమాణం మారుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలు బీర్ తాగడానికి ఇష్టపడుతున్నారు. కానీ బీర్ ఆరోగ్యానికి ప్రమాదకరం. అధిక మోతాదులో బీర్ తీసుకోవడం వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు, తలనొప్పికి దారితీస్తుంది. మరోవైపు నిత్యం ఎవరైనా బీర్ తీసుకుంటే స్థూలకాయం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పద్దతుల ద్వారా బెల్లీఫ్యాట్‌ తగ్గించుకోవచ్చు.

బీర్ బెల్లీఫ్యాట్‌కి కారణం అవుతుంది. నడుము పరిమాణం పెరగడం వల్ల మధుమేహం, ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ బెల్లీఫ్యాట్‌ని నివారించాలి. ఎక్కువగా బీర్ తాగడం తగ్గించుకోవాలి. లేదంటే శరీరంలోకి ఎక్కువ మొత్తంలో కేలరీలు వెళ్తాయి. రోజు బీర్ తాగినట్లయితే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. దీని కోసం ఎల్లప్పుడూ పండ్లు, కూరగాయలని తినాలి. దీంతో శరీరానికి తగినంత విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. ఇది శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఫైబర్ ఆహారాలని ఎక్కువగా తీసుకోవాలి. ఉదర భాగంలో కొవ్వు ఉంటే ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినాలి. ఈ ఆహారాలు గుండె జబ్బులు, మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజూ డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. అంతేకాదు బీర్‌ తాగడం మానుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Tags:    

Similar News