Health Tips: వేసవిలో ఈ న్యాచ్‌రల్‌ జ్యూస్ అద్భుతం.. ధర తక్కువ పోషకాలు ఎక్కువ..!

Health Tips: వేసవిలో చాలామంది చల్లటి పానీయాలు తాగడానికి ఇష్టపడుతారు.

Update: 2023-03-21 04:00 GMT

Health Tips: వేసవిలో ఈ న్యాచ్‌రల్‌ జ్యూస్ అద్భుతం.. ధర తక్కువ పోషకాలు ఎక్కువ..!

Health Tips: వేసవిలో చాలామంది చల్లటి పానీయాలు తాగడానికి ఇష్టపడుతారు. అందుకే ఎక్కువగా శీతల పానీయాలు, మజ్జిగ వంటివి తీసుకుంటారు. అయితే వీటికి బదులు చెరుకు రసం తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల దాహం తీరడమే కాకుండా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చెరకు రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ వంటి గుణాలు సమృద్దిగా ఉంటాయి. చెరుకు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

చెరకు రసం ఒక సహజ పానీయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, ఫోటోప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ప్రతిరోజూ చెరకు రసాన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. మీరు అనేక వ్యాధుల నుంచి బయటపడతారు.

సూపర్ ఎనర్జీ డ్రింక్

చెరకు రసం ఒక సూపర్ ఎనర్జీ డ్రింక్. దీన్ని తీసుకుంటే ఎనర్జీ లెవెల్ పెరిగి అలసట దూరమవుతుంది. అంతే కాదు డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఎముకలు దృఢంగా

చెరుకు రసం తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. అందుకే రోజూ చెరుకు రసం తాగడం వల్ల ఎముకల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కాలేయం ఆరోగ్యం

చెరకు రసం కాలేయానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

కిడ్నీల్లో రాళ్ల సమస్య

ఒక ఆఫ్‌ లీటర్‌ చెరుకురసంలో 26.56 క్యాలరీల ఎనర్జీ, 27.51 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, 0.27 గ్రాముల ప్రోటీన్‌, 11.23 మిల్లిగ్రాముల క్యాల్షియం, 0.37 ఎమ్‌జీ ఐరన్‌, 41.96 ఎమ్‌జీ పొటాషియం, 17.01 ఎమ్‌జీ సోడియం ఉంటుంది. చెరుకు రసం నిత్యం తాగడం వల్ల మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు చెక్‌ పెట్టొచ్చు. కిడ్నీల్లో రాళ్ల సమస్యను చెరుకు రసం దూరం చేస్తుంది.

Tags:    

Similar News