Health Tips: సండే మండే గుడ్డు మాత్రమే కాదు ప్రతిరోజు పాలు కూడా తాగాలి.. ఎందుకంటే..?
Health Tips: రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల సరైన మొత్తంలో కాల్షియం మాత్రమే కాకుండా ప్రోటీన్, పొటాషియం, అయోడిన్, పాంటోథెనిక్ యాసిడ్ అందుతాయి.
Health Tips: పాలు సంపూర్ణ ఆహారం.. అందుకే రోజువారీ ఆహారంలో ముఖ్యభాగమని చెప్పవచ్చు. పాలలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీర అభివృద్ధికి తోడ్పడుతాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల సరైన మొత్తంలో కాల్షియం మాత్రమే కాకుండా ప్రోటీన్, పొటాషియం, అయోడిన్, పాంటోథెనిక్ యాసిడ్ అందుతాయి. పాలు ఎముకలతోపాటు దంతాలకూ మేలు చేస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పాలు మన మెదడుకు ఎలా ఉపయోగపడుతాయో ఈరోజు తెలుసుకుందాం.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి
పాలలో ఉండే పోషకాలు ముఖ్యంగా B విటమిన్లు, ప్రోటీన్లు మెదడుకు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు పోషకాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. విటమిన్ బి ఆరోగ్యకరమైన మెదడు కణాల నిర్వహణలో, జ్ఞాపకశక్తి ఏర్పడటానికి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
పిల్లలలో మెదడు అభివృద్ధి
పిల్లలకి పాలు చాలా ముఖ్యమైన ఆహారం. ఎందుకంటే వారిలో మెదడు అభివృద్ధికి ఇవి సహాయపడుతాయి. పాలలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి, బి12 మెదడు అభివృద్ధికి సహకరిస్తాయి.
శక్తిని అందించడం కోసం
పాలలోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఇతర పోషకాలు మెదడుకు నిరంతర శక్తిని అందిస్తాయి. నిరంతర ఏకాగ్రత, దృష్టిని పెంచుతాయి. రోజూ అల్పాహారం లేదా మధ్యాహ్నం సమయంలో సరైన మొత్తంలో పాలు తాగడం వల్ల పనితీరులో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
రోజును ఒక గ్లాసు పాలతో ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఎక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నట్లయితే తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలు తాగాలి. ప్రత్యామ్నాయ పాల ఉత్పత్తులను ఇష్టపడితే ఆహారంలో పెరుగు, పనీర్‌ను చేర్చుకోవచ్చు. ఇవి మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతాయి.