Black Pepper: నల్ల మిరియాల నీటితో రోగనిరోధక శక్తి అమోఘం..!
*సుగంధ ద్రవ్యాల్లో మిరియాలు చాలా ముఖ్యమైనవి *రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మిరియాలు అద్భుతంగా ఉపయోగపడుతాయి
Black Pepper: సుగంధ ద్రవ్యాల్లో మిరియాలు చాలా ముఖ్యమైనవి. భారతీయ వంటకాలలో వీటిని కచ్చితంగా వాడుతారు. ఇవి ఆహారం రుచిని పెంచడమే కాదు ఇంకా చాలా ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతాయి. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. సనాతన ఆయుర్వేదంలో వీటిని ఎప్పటి నుంచో ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ వ్యాపించినప్పటి నుంచి వీటి వినియోగం బాగా పెరిగింది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మిరియాలు అద్భుతంగా ఉపయోగపడుతాయి. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన వంటింట్లోనే ఉంటుంది.
అయితే అనారోగ్యంగా ఉన్నవారు ప్రతిరోజు కప్పు మిరియాల నీటిని తీసుకుంటే వెంటనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని ఎలా తయారు చేయాలంటే ఒక గ్లాసు నీటిలో 4-5 నల్ల మిరియాలు వేయాలి. వాటిని బాగా మరిగించాలి. రంగు మారడం కనిపించిన వెంటనే కప్పులో పొసుకొని చల్లార్చి తీసుకోవాలి. ఈ నీటి ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.
1. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పరిశోధనలో నల్ల మిరియాలు గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయని తద్వారా మీ ఆరోగ్యం మెరుగు పరుస్తుందని తేలింది. ఇది శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయ పడుతుంది.
2. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం ఒక అధ్యయనం ప్రకారం నల్ల మిరియాలలో పైపెరిన్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఒక మూలకం. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయ పడుతుంది.
3. బరువు తగ్గడంలో సహాయ పడుతుంది బరువు తగ్గడం ఈ పానీయం ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి. చాలా మంది ప్రజలు తమ రోజువారీ దినచర్యలో వీటిని తీసుకుంటే చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది కేలరీలను బర్న్ చేస్తుంది.
4. అజీర్ణ సమస్యలకు పరిష్కారం మీరు అజీర్తితో బాధ పడుతుంటే నల్ల మిరియాలు నీరు మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడే జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇది ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌లపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మొత్తం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.