Dragon Fruit: క్యాన్సర్ కు చెక్ పెట్టే డ్రాగన్ ఫ్రూట్
Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ లో యాంటిక్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.
Dragon Fruit: ఈ మద్యకాలంలో తరచుగా మనకు వినిపిస్తోన్న పేరు డ్రాగన్ ఫ్రూట్. వీటిని గతంలో ఇండోనేషియాలో పండిస్తారు. సహజంగా పెరిగిన అడవి పండ్లుగా పరిగణించేవారు. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన నేపథ్యంలో ప్రపంచమంతా వ్యాపించాయి. ఇది సహజంగా పెరిగే అడవి పండుగా పరిగణించబడింది, కానీ ఇప్పుడు దీనిని క్వీన్ ఆఫ్ ది నైట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని పువ్వులు రాత్రి సమయంలో చాలా వేగంగా వికసిస్తాయి. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ ఫ్రూట్ యొక్క విశేషాలేంటో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.
- దీనిని సూపర్ ఫ్రూట్ అని అంటారు. ఎందుకంటే దీనికి అనేక వ్యాధులను నిరోధించే సామర్థ్యం ఉంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ "సి" కాకుండా, డ్రాగన్ పండ్లలో విటమిన్ "బి" 12 లేదా ఫోలిక్ ఆమ్లం కూడా ఉన్నాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారకంగా కూడా ఇది పనిచేస్తుంది.
- డ్రాగన్ పండ్లపై ఇటీవలి జరిపిన అధ్యయనం ప్రకారం వీటిలో యాంటిక్యాన్సర్ లక్షణాలు కూడా ఉండవచ్చును. ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్ విషయంలో. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. విటమిన్ సి యొక్క యాంటీఆక్సిడెంట్ నాణ్యతతో పాటు, పిటాయా పండ్లలో ఇతర సహజ యాంటీఆక్సిడెంట్ వనరులు కూడా ఉంటాయి.
- నీటి శాతం సమృద్ధిగా ఉండే ఈ పండు శరీరంలోని ద్రవ పదార్థాన్నిబాగా పెంచుతుంది. దాని పేస్ట్‌ను తేనెతో కలపడం వల్ల ముఖం మీద మచ్చలు తొలగి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పండు ఉపయోగపడుతుంది. దీని ఉపయోగం చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టుకు ఉపయోగపడుతుంది.
- ఇందులో ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఎర్రటి ప్లేట్‌లెట్స్ లోపాన్ని కూడా తొలగిస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ కారకంగా కూడా ఇది పనిచేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. హేమోరాయిడ్లను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.
- ఇది రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన శక్తిని అందించడంలో కూడా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో డ్రాగన్ పండ్లను తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది విటమిన్ "సి" తో సమృద్ధిగా కూడా ఉంటుంది. విటమిన్ సి ముడి పండ్లు, కూరగాయల రూపంలో లేదా రసాల రూపంలో గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మంచిది.
- ఇంకా అనేక రకాల జబ్బులకు ఈ ఫ్రూట్ పనికొస్తుందని పలు అద్యయనాలు తెలుపుతున్నాయి. కాక పోతే దీని రేటు మాత్రం కాస్త ఎక్కువగా వుంటుంది. ఈ మధ్య కాలంలో మనకు అందుబాటులో వుంటుంది. దీని మొక్కను పెంచుకోవడం కూడా చాలా తేలిక. ఆసక్తి వున్నారు మొక్కను కూడా పెంచుకోవచ్చు.