Lemon Peels Benefits: రసం పిండిన నిమ్మ తొక్కలతో భలే ప్రయోజనాలు..!
Lemon Peels Benefits: రసం పిండిన నిమ్మ తొక్కలతో భలే ప్రయోజనాలు..!
Lemon Peels Benefits: నిమ్మకాయ ప్రయోజనాల గురించి అందరికి తెలుసు. ఇది చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. దీని రసంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అయితే రసం పిండేసిన నిమ్మ తొక్కలని పనికారావని చెత్తబుట్టలో వేస్తాం. కానీ వీటివల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలతో ఈ రోజు తెలుసుకుందాం.
నిమ్మ తొక్క ప్రయోజనాలు
నిమ్మతొక్కలలో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, యాంటీ-ఆక్సిడెంట్ల వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. శరీరానికి బాహ్య, అంతర్గత మార్గంలో పనిచేస్తాయి. నిమ్మ తొక్కల పొడి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.
నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలి..?
నిమ్మతొక్కలని పౌడర్‌గా చేసి అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. మీరు వంటగదిని శుభ్రం చేయాలనుకుంటే నిమ్మ తొక్కల పౌడర్‌లో సగం బేకింగ్ సోడాను కలిపి అప్లై చేయడం ద్వారా గ్యాస్, స్లాబ్‌ను శుభ్రం అవుతుంది. బేకింగ్ సోడా కాకుండా వెనిగర్‌ను కూడా ఉపయోగించవచ్చు. స్నానం చేసేటప్పుడు నిమ్మ తొక్కతో శరీరాన్ని రుద్దితే క్రిములు తొలగిపోతాయి. వంటగదిలో ఏదైనా మూలలో వాసన వస్తుంటే నిమ్మతొక్కను అక్కడ పెడితే వాసన పోతుంది. నిమ్మకాయ తొక్కను ఫేస్ మాస్క్‌లలో కూడా ఉపయోగించవచ్చు.