Health Tips: మెడపై నల్లటి వలయాలని తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?

Health Tips: చాలాసార్లు కళ్ల కింద కనిపించే నల్లటి వలయాల గురించి తరచుగా చర్చిస్తాం.

Update: 2022-09-14 15:30 GMT

Health Tips: మెడపై నల్లటి వలయాలని తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?

Health Tips: చాలాసార్లు కళ్ల కింద కనిపించే నల్లటి వలయాల గురించి తరచుగా చర్చిస్తాం. అవి నిద్ర లేకపోవడం, ఒత్తిడి కారణంగా ఏర్పడుతాయి. కానీ మెడపై కనిపించే నల్లటి వలయాల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఇవి మురికి పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి. అయితే అంతర్గత సమస్యల వల్ల ఇలా జరుగుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లయితే తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. కాబట్టి అప్రమత్తంగా ఉండటం అవసరం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మెడపై కనిపించే నల్లటి వలయాల విషయంలో సీరియస్‌గా ఉండటం ముఖ్యం. పట్టించుకోకపోతే పెద్ద సమస్యగా మారుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవి ప్రీడయాబెటిస్ లక్షణాలు. అంటే మీ శరీరం ఇప్పుడు డయాబెటిస్ సంకేతాలను చూపుతోంది. వీటిని తొలగించడానికి రెగ్యులర్ వ్యాయామం అవసరం. అలాగే రోజువారీ ఆహారంలో మార్పులు చేయాలి. ఒత్తిడి తగ్గింపు, 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. సిగరెట్లు, బీడీలు, హుక్కాలు మన ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. వీటివల్ల మెడపై నల్లటి వలయాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజే ఈ చెడ్డ అలవాట్లని వదిలేయండి.

మీరు జీవనశైలిలో మార్పుల ద్వారా ప్రీడయాబెటిస్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. చర్మంపై ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే దీని కోసం వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఆపై పరీక్ష చేయడం అస్సలు మర్చిపోవద్దు. నడుము లేదా భుజాలపై వెల్వెట్ చర్మం కనిపించడం ప్రారంభించినట్లయితే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రీడయాబెటిస్ లక్షణాలలో చేర్చబడిన ఇన్సులిన్ పెరిగిన సంకేతమని గుర్తించండి.

Tags:    

Similar News