షాంపూతో ప్రయోగాలు చేస్తే బట్టతలే.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Shampoo Mistakes: చాలామంది జుట్టును శుభ్రం చేయడానికి షాంపూని ఉపయోగిస్తారు.

Update: 2022-10-06 11:30 GMT

షాంపూతో ప్రయోగాలు చేస్తే బట్టతలే.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Shampoo Mistakes: చాలామంది జుట్టును శుభ్రం చేయడానికి షాంపూని ఉపయోగిస్తారు. ఇది తలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని వదిలించడానికి సహాయపడుతుంది. అయితే షాంపూని ఉపయోగించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోపోతే ప్రయోజనానికి బదులుగా బాధపడవలసి ఉంటుంది. వాస్తవానికి చాలా మందికి షాంపూని ఎలా వాడాలో తెలియదు. దీని కారణంగా చాలా తప్పులు చేస్తారు. దీంతో వెంట్రుకలు పలచబడి బట్టతల వచ్చేస్తుంది. షాంపూతో జుట్టును కడగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

1. వెంట్రుకలకి షాంపూ రాసుకున్నప్పుడు నురుగ వస్తుంది. దీనిని జుట్టుకి మొత్తం అప్లై చేయాలి. కానీ చాలామంది నురుగ తక్కువగా వస్తుందని షాంపూని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివల్ల జుట్టుపై కెమికల్స్‌ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇది జుట్టుని పాడుచేస్తుంది. ఏదైనా అతిగా తీసుకోవడం అనర్థమే అని గుర్తుంచుకోండి.

2. జుట్టుని బట్టి షాంపుని నిర్ణయించాలి. ఏది అనుకూలంగా ఉంటే దానిని వాడాలి. కానీ ఇష్టారీతిన రకరకాల షాంపులు వాడితే జుట్టు మొత్తం ఊడిపోతుంది. బట్టతల వచ్చేస్తుంది. మీ జుట్టుకి ఏదైతే షాంపు అనుకూలంగా ఉంటుందో ముందుగా దానిని కనిపెట్టి వాడాలి.

3. జుట్టుకి షాంపూ చేసిన తర్వాత కొంతమంది చాలా వేడినీటితో వాష్‌ చేస్తారు. ఇది సరైన పద్దతి కాదు. ఎందుకంటే వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటుంది. ఇది జుట్టు రాలడం సమస్యను పెంచుతుంది. బట్టతల ప్రమాదాన్ని సృష్టిస్తుంది. జుట్టుకి ఎప్పుడైనా గోరువెచ్చని నీటిని వాడాలి.

4. జుట్టుకి షాంపు అప్లై చేసేటప్పుడు మృదువుగా చేయాలి. గట్టిగా రుద్దకూడదు. దీనివల్ల జుట్టు దెబ్బతింటుంది. తేలికపాటి చేతులతో మసాజ్ చేసిన విధంగా అప్లై చేయాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Tags:    

Similar News