Bathing Mistakes: తలస్నానం విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుంది..!

Bathing Mistakes: మారిన జీవనశైలి, వాతవరణ కాలుష్యం వల్ల జుట్టు రాలే సమస్య చాలా మందిలో ఉంది.

Update: 2023-08-29 02:45 GMT

Bathing Mistakes: తలస్నానం విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుంది..!

Bathing Mistakes: మారిన జీవనశైలి, వాతవరణ కాలుష్యం వల్ల జుట్టు రాలే సమస్య చాలా మందిలో ఉంది. దీనికి తోడు ఉరుకుల పరుగుల జీవితంలో తలస్నానం చేసేటప్పుడు కూడా జుట్టుని పట్టించుకోవడం లేదు. దీంతో జుట్టు ఎక్కువగా రాలి చాలామందికి బట్టతల వచ్చేస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జుట్టు కడిగేటప్పుడు కొన్ని పద్దతులని పాటించాలి. కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా అందంగా తయారవుతుంది. దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం.

1. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు జుట్టుకు నూనె రాయాలి

2. తరువాత నీటితో జుట్టును పూర్తిగా తడి చేయాలి.

3. షాంపూని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి.

4. జుట్టు కడిగిన తర్వాత సహజ గాలిలో ఆరనివ్వాలి.

5. ఎక్కువ వేడినీటితో తలస్నానం చేయకూడదు.

ఈ తప్పులను నివారించండి

తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టును దువ్వకూడదు. ఎందుకంటే ఇది జుట్టును బలహీనపరుస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎక్కువ జుట్టు రాలుతుంది. వారానికి 2 నుంచి 3 సార్ల కంటే తలస్నానం చేయకూడదు. ఎక్కువగా జుట్టుని కడిగితే జుట్టు పొడిగా మారుతుంది. జుట్టును కడిగిన వెంటనే నూనె రాయకూడదు. దీనివల్ల జుట్టు బలహీనపడుతుంది. తలస్నానం తర్వాత జుట్టుని ఆరబెట్టాలి. తరువాత కొన్ని చుక్కల నూనె తలపై వేసి మసాజ్ చేసుకోవాలి.

కలబంద ఉపయోగించండి

మార్కెట్‌లో లభించే కండీషనర్‌కు బదులుగా కలబందను ఉపయోగిస్తే జుట్టుకి చాలా మంచిది.

కలబందను వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తలకు పట్టించాలి. ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా మారడంతో పాటు చుండ్రు ఏమైనా ఉంటే తొలగిపోతుంది. అలాగే హెయిర్ డ్రయ్యర్ వేడి గాలి కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది. అందుకే మెత్తడి క్లాత్‌తో జుట్టుని తుడవాలి. జుట్టు ఆరడానికి సహజ గాలి సరిపోతుంది. కొన్ని నిమిషాల్లో జుట్టు పూర్తిగా ఆరిపోతుంది.

Tags:    

Similar News