Health Tips: చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..!

Health Tips: చలికాలంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు స్నానం చేయడం చాలా కష్టమవుతుంది.

Update: 2022-11-19 01:44 GMT

Health Tips: చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..!

Health Tips: చలికాలంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు స్నానం చేయడం చాలా కష్టమవుతుంది. ఈ పరిస్థితిలో చాలా మంది గీజర్ లేదా హీటింగ్ రాడ్ ద్వారా వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. చల్లటి నీటితో సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రభావవంతమైన పరిష్కారం. కానీ ప్రతి ఒక్కరూ దీన్ని పాటించలేరు. కొంతమంది చల్లని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతారు. ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది.

చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల చలికి సున్నితంగా ఉండేవారు ప్రాణాంతకంగా మారే ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయవద్దు. చాలా మంది ఆరోగ్య నిపుణుల ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఎప్పుడైనా సంభవిస్తుంది.

కానీ శీతాకాలంలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎక్కడో ఒక చోట రిస్క్‌లో పడిపోవడం ఖాయం. అందుకే చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయకూడదు. శరీరం ఇస్తున్న సంకేతాలు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలా కాదా అని తెలుసుకోవాలి. అప్పుడే మీరు తక్షణ చర్యలు తీసుకొని మీ జీవితాన్ని కాపాడుకోగలరు.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు

1. శరీరంలోని ఏదైనా భాగంలో తిమ్మిరి

2. కళ్లతో స్పష్టంగా చూడలేకపోవడం

3. శరీరంలో బలహీనత

4. తలనొప్పిపెరగడం

5. వాంతులు లేదా వికారం

6. అర్థం చేసుకోవడంలో ఇబ్బంది

7. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

8. మెదడులో రక్తస్రావం కారణంగా మూర్ఛపోవడం

Tags:    

Similar News