Health Tips: ఉదయం టిఫిన్‌గా ఈ ఆహారాలు తీసుకుంటే జంక్‌ఫుడ్ తిన్నట్లే.. అవేంటంటే..?
Health Tips: ఉదయం పూట ఎంతమంచి టిఫిన్ తింటే రోజు అంత బాగుంటుంది.
Health Tips: ఉదయం పూట ఎంతమంచి టిఫిన్ తింటే రోజు అంత బాగుంటుంది. అందుకే అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఆహార పదార్థాలని ఎంచుకోవాలి. ఈరోజుల్లో చాలామంది టిఫిన్‌గా జంక్‌ఫుడ్ తింటున్నారు. కొన్నిసార్లు ఈ విషయం వారికి తెలియడం లేదు. సమయభావన వల్ల ఏది పడితే అది తింటున్నారు. తర్వాత ఆస్పత్రిపాలవుతున్నారు. అందుకే ఉదయం పూట తీసుకోకూడని ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
1. కాఫీ
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది తాగిన తర్వాత రిఫ్రెష్ గా అనిపించినా ఆరోగ్యానికి మాత్రం మంచిదికాదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది.
2. బ్రెడ్
ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే తొందరలో చాలామంది వైట్ బ్రెడ్, జామ్ కలిపి తింటున్నారు. అయితే వైట్ బ్రెడ్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అల్పాహారంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్‌ను భాగం చేసుకోవడం ఉత్తమం.
3. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్
పండ్లు, జ్యూస్‌లు ఉదయం పూట తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ కొందరు మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలను తాగుతున్నారు. ఈ జ్యూస్‌లలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్‌లు, షుగర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కాబట్టి ఈ అలవాటును వదిలేస్తే ఉత్తమం.
4. ప్రాసెస్ చేసిన తృణధాన్యాలు
గత కొన్నేళ్లుగా అల్పాహారంలో తృణధాన్యాలు తినే ధోరణి చాలా పెరిగింది. అయితే ఈరోజుల్లో చాలామంది ప్రాసెస్ చేసిన తృణ ధాన్యాలని తింటున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహం, ఊబకాయం, గుండెపోటు ప్రమాదం ఉంటుంది. అందుకే సహజసిద్దమైన తృణ ధాన్యాలు తినడానికి ప్రయత్నించండి.
5. ఫ్లేవర్డ్ పెరుగులు
ఈ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్‌లో పెరుగుకు బదులుగా ఫ్లేవర్డ్ పెరుగులని తినే ట్రెండ్ పెరిగింది. ఈ ఫుడ్ ఐటమ్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే ఉదయం పూట తినకూడదని గుర్తుంచుకోండి.