Health Tips: తిన్న తర్వాత నోటినుంచి దుర్వాసన వస్తుందా..!

Health Tips: ఈ రోజుల్లో చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది నోటి దుర్వాసనని ఎదుర్కొంటున్నారు.

Update: 2022-12-07 14:30 GMT

Health Tips: తిన్న తర్వాత నోటినుంచి దుర్వాసన వస్తుందా..!

Health Tips: ఈ రోజుల్లో చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది నోటి దుర్వాసనని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య చెప్పడానికి చాలా చిన్నది కానీ పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. నోటి దుర్వాసన కారణంగా ప్రజలు నెమ్మదిగా మీకు దూరమవుతారు. పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు. తిన్న తర్వాత ఈ సమస్య మరింత పెరుగుతుంది. అయితే కొంతమంది తిన్న తర్వాత పళ్ళు తోముకుంటారు కానీ తర్వాత కూడా ఈ సమస్య నుంచి బయటపడరు. పైగా ఎక్కువగా బ్రష్ చేయడం వల్ల దంతాలు, చిగుళ్ళలో సమస్యలు ఏర్పడుతాయి. వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు మౌత్ ఫ్రెషనర్లుగా పనిచేస్తాయి. తిన్న తర్వాత వీటిని నమలినట్లయితే నోటి నుంచి వచ్చే దుర్వాసన నుంచి బయటపడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

పుదీనా

పుదీనా వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్కెట్‌లో లభించే అనేక మౌత్ ఫ్రెషనర్లు, టూత్‌పేస్ట్‌లలో పుదీనా కలుపుతారు. తిన్న తర్వాత కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. పుదీనాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చెడు వాసన వచ్చే బ్యాక్టీరియాను చంపుతుంది.

లవంగం

ఆహారం తిన్న తర్వాత లవంగాలు తింటే నోటి దుర్వాసన ఉండదు. వీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. లవంగాలు సువాసనగా ఉంటాయి. వీటిని తినడం వల్ల నోటిలో తాజాదనం ఏర్పడుతుంది.

సోంపు

సోంపు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటి నుంచి నిత్యం దుర్వాసన వస్తుంటే తిన్న తర్వాత సోంపు వేసుకోవాలి. కొద్దిసేపట్లో నోటిలో తాజా వాసన వస్తుంది. సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నీరు

ఎక్కువ సేపు నీళ్లు తాగకపోతే నోటి దుర్వాసనను వ్యాపింపజేసే బ్యాక్టీరియా నోటిలో పెరుగుతుంది. తక్కువ నీరు తాగే చాలా మంది ప్రజలు నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటారు. మీరు ఈ సమస్యను నివారించాలంటే ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

Tags:    

Similar News