Heart Beat Increased: తరచుగా గుండె వేగంగా కొట్టుకుంటుందా.. ఈ సమస్యల వల్ల కూడా జరుగుతుంది..!

Heart Beat Increased: చలికాలంలో కొంతమందికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీంతో వారు కంగారుపడుతారు. తనకు ఏదో అయిందన్న టెన్షన్‌కు గురవుతారు.

Update: 2024-01-23 16:00 GMT

Heart Beat Increased: తరచుగా గుండె వేగంగా కొట్టుకుంటుందా.. ఈ సమస్యల వల్ల కూడా జరుగుతుంది..!

Heart Beat Increased: చలికాలంలో కొంతమందికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీంతో వారు కంగారుపడుతారు. తనకు ఏదో అయిందన్న టెన్షన్‌కు గురవుతారు. వాస్తవానికి చలికాలంలో ఇది సాధారణ సమస్య. ఎందుకంటే ఉష్ణోగ్రత తగ్గడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది. బీపీ పెరగడం కారణంగా గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. సాధారణంగా హార్ట్ బీట్ పెరగడం అనేది గుండెకు సంబంధించిన సమస్యగా చెబుతారు. కానీ ప్రతిసారీ ఇలా జరగాలని ఏమీలేదు. కొన్నిసార్లు మెదడు సమస్యల కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. మానసిక సమస్యల వల్ల కూడా హార్ట్ బీట్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఒత్తిడి, టెన్షన్‌, ఆందోళన మానసిక సమస్యల కిందకు వస్తాయి. ఒక వ్యక్తి ఏదైనా దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నప్పుడు, అతను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడుతాడు. దీంతో గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. అకస్మాత్తుగా చెమటలు వస్తాయి. ఆందోళన గరిష్ట స్థాయికి చేరుకున్నట్లయితే వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిఉంటుంది.

ఆందోళన నివారించడానికి ధ్యానం చేయాల్సి ఉంటుంది. మనస్సును తేలికపరచడానికి స్నేహితుడు, భాగస్వామి, కుటుంబం లేదా ఇతర పరిచయస్తులతో మాట్లాడాలి. ఏ విషయం గురించి అతిగా ఆలోచించకూడదు. మీ దృష్టిని మరల్చడానికి మీ అభిరుచులు, ఆసక్తులపై సమయాన్ని వెచ్చించాలి. ఇది మీ మనస్సును తేలిక పరుస్తుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు వినోదం, పనితో ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలి. పూర్తి నిద్ర పొందడానికి ప్రయత్నించాలి. సమస్య పరిష్కారం కాకపోతే మానసిక నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవాలి.

Tags:    

Similar News