Health Tips: టీ తాగితే ముఖం నల్లగా మారుతుందా.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!
Health Tips: భారతదేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయాలలో టీ రెండవది.
Health Tips: భారతదేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయాలలో టీ రెండవది. చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగి రోజుని ప్రారంభిస్తారు. అంతేకాదు పడుకునే వరకి ఎన్నిసార్లు టీ తాగుతారో కూడా తెలియదు. టీ వల్ల కొన్ని ప్రయోజనాలు మరికొన్ని అప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒకటి టీ తాగితే చర్మం నల్లగా మారుతుందా అనే ప్రశ్న అందరిరని వేధిస్తుంది. ఈ భయం వల్ల చాలామంది టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం దాగి ఉందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నల్లటి చర్మం కలిగి ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతారు. దీనిని మార్చుకోవాలని కోరుకుంటారు. టీ తాగడం వల్ల కడుపు నొప్పి, నిద్రలేమి, మధుమేహం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ చాలా మంది టీ తాగకుండా ఉండలేరు. బాల్యంలో పిల్లలు టీ తాగకూడదని అంటారు. ఎందుకంటే ఇందులో కెఫీన్ ఉంటుంది. ఇది చిన్న పిల్లలకు హానికరమని చెబుతారు. కానీ అదే పిల్లలు పెద్దయ్యాక కూడా ఇదే నిజమని నమ్ముతారు.
టీ తాగే అలవాటు లేకపోవడం మంచి విషయమే కానీ అనవసరంగా ఆ రూమర్ ని జీవితాంతం మోసుకెళ్లడం సరికాదు. టీ తాగితే చర్మం నల్లగా మారుతుందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చర్మ సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం చర్మం రంగు జన్యుశాస్త్రం, జీవనశైలి, బహిరంగ కార్యకలాపాలు, చర్మంలోని మెలనిన్ ఉనికిపై ఆధారపడి ఉంటుంది. టీ తగితే చర్మం నల్లగా మారుతుందనే పుకార్లను ప్రచారం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే శాస్త్రీయ ఆలోచనతో ముందుకు సాగడం ఉత్తమం.