Health Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్‌లని డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: ఈ బిజీ లైఫ్‌లో పని ఒత్తిడి, ఇతరత్రా పనుల వల్ల చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు.

Update: 2022-08-12 10:30 GMT

Health Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్‌లని డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: ఈ బిజీ లైఫ్‌లో పని ఒత్తిడి, ఇతరత్రా పనుల వల్ల చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఫలితంగా వారి శరీరం తొందరగా అలసిపోతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో పలు వ్యాధులకి గురికావాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఎనర్జిటిక్‌ డ్రింక్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. దీనివల్ల మీరు రోజు మొత్తం ఫిట్‌గా ఉంటారు. అంతేకాదు ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అలాంటి కొన్ని జ్యూస్‌ల గురించి తెలుసుకుందాం.

1. వెజిటబుల్ జ్యూస్: కూరగాయలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మీరు కూరగాయల జ్యూస్‌ తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. దీన్ని డైట్‌లో చేర్చుకుని వారానికి మూడుసార్లు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2. సొరకాయ రసం: సొరకాయ రసంలో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇందులో జింక్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. మీరు పరిమిత పరిమాణంలో రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

3. టొమాటో, బీట్‌రూట్‌ రసం: బీట్‌రూట్ రక్తాన్ని పెంచడానికి ఉత్తమ ఎంపిక. అయితే టొమాటో శరీరంలోని అనేక మూలకాల లోపాన్ని తొలగిస్తుంది. ఈ రెండింటిని కలిపి జ్యూస్ తయారు చేసి వారానికి మూడు సార్లు తాగాలి. కొద్ది రోజుల్లోనే తేడాను గమనిస్తారు.

Tags:    

Similar News