Tea Facts: టీ తాగడం వల్ల బరువు పెరుగుతారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Tea Facts: ఉదయమే టీ తాగి రోజుని ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. కొంతమందికైతే టీ తాగకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది.

Update: 2023-07-26 02:03 GMT

Tea Facts: టీ తాగడం వల్ల బరువు పెరుగుతారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Tea Facts: ఉదయమే టీ తాగి రోజుని ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. కొంతమందికైతే టీ తాగకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. అంతేకాదు ఇలాంటి వారు తలనొప్పి, అలసట సమస్యలని ఎదుర్కొంటారు. అందుకే నిద్ర లేచిన వెంటనే టీ తాగుతారు. అయితే టీ పొడి, పాలు, చక్కెర మిశ్రమం స్థూలకాయాన్ని పెంచుతాయి. అంతేకాదు ఇది జీర్ణక్రియకి కూడా మంచిది కాదు. అందుకే టీ తాగేటప్పుడు కొన్ని విషయాలని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

టీ తాగడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది కొవ్వుగా మారుతుంది. స్థూలకాయాన్ని పెంచుతుంది. కాబట్టి చక్కెర లేకుండా టీ తాగాలి. లేదా తక్కువ చక్కెరను కలుపుకోవాలి. దీనివల్ల ఫిట్‌నెస్‌లో తేడా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు టీలో దాదాపు 125 కేలరీలు ఉంటాయి. కొంతమంది టీని తయారు చేయడానికి ఫుల్ ఫ్యాట్ పాలను ఉపయోగిస్తారు. పొట్ట, బెల్లీఫ్యాట్ పెరగకూడదంటే ఇలాంటి పాలని అవైడ్‌ చేయాలి.

ఇక కొంతమంది టీ తాగినప్పుడల్లా చిరుతిళ్లు తింటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు బరువు పెరగుతారు. రోజు మొత్తంలో చాలా టీలు తాగితే ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుంది. ఈ పానీయాన్ని 24 గంటల్లో కేవలం 2 సార్లు మాత్రమే తాగాలని గుర్తుంచుకోండి. పాలు, పంచదార కలిపిన టీకి బదులు గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు తాగితే పొట్ట కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఇది ఆరోగ్యానికి ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

Tags:    

Similar News