Tea Effect: టీ తాగితే బరువు పెరుగుతారా.. వాస్తవం ఏంటంటే..?
Tea Effect: చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది మీకు శక్తినిస్తుంది.
Tea Effect: చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది మీకు శక్తినిస్తుంది. అయితే కొంతమంది రోజుకు 4 నుంచి 5 కప్పుల టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఫిట్‌గా ఉండాలంటే టీకి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే పాలతో చేసిన టీ తాగడం వల్ల బరువు పెరుగుతారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.
టీ తాగితే బరువు పెరుగుతారా అనేది అందులో ఉపయోగించే పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. టీ తయారీలో పాలు, చక్కెరను ఉపయోగిస్తారు. కానీ ఈ రెండు పదార్థాలు బరువు పెరగడానికి కారణం అవుతాయి. మరోవైపు మీరు అధిక కొవ్వు పాలతో కూడిన టీని తాగితే అది మరింత బరువును పెంచుతుంది. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే టీ తాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. టీలో చక్కెర మొత్తాన్ని తగ్గించండి.
స్వీటెనర్లు లేకుండా టీ అసంపూర్ణంగా ఉంటుంది. కానీ మీ ఆరోగ్యం కోసం మీరు టీలో చక్కెరను ఉపయోగించడం మానుకోవాలి. ఇది కాకుండా మీరు టీలో తేనె, బెల్లం ఉపయోగించవచ్చు.మీరు టీని ఇష్టపడి వదులుకోలేకపోతే టీలో తక్కువ కొవ్వు పాలను ఉపయోగించండి. అలాగే పాల పొడిని నివారించండి. ఉదయం సాయంత్రం రోజుకి రెండు కప్పులు తాగే విధంగా అలవాటు చేసుకోండి.