ఆన్‌లైన్ క్లాస్‌ల ఎఫెక్ట్ : మానసిక ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందంటున్న వైద్యులు!
కరోనా మహమ్మారి దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌ల హవా నడుస్తోంది. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇక ఖాళీ సమయాల్లో సినిమాలు, వీడియోలు చూసేందుకు స్మార్ట్ ఫోన్లను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు.
కరోనా మహమ్మారి దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌ల హవా నడుస్తోంది. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇక ఖాళీ సమయాల్లో సినిమాలు, వీడియోలు చూసేందుకు స్మార్ట్ ఫోన్లను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. చివరకు నిద్రలో సైతం సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా కలవరింతలు పెడుతున్నారంటే... ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వాడకం ఇప్పుడు అధికం అయింది. అదే ఇప్పుడు మాన వసంబందాలను సైతం దూరం చేయడంతో పాటు మానసికికంగా శారీరకంగా కూడా సమస్యలను తీసుకొస్తోంది. ఇక లాక్‌డౌన్ ఎఫేక్ట్ తో వర్క్ ఫ్రమ్ హోం కారణంగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగం 75 శాతం పెరిగింది. కాల్స్ చేసేందుకు 63 శాతం, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ మాధ్యమాల కోసం 59 శాతం మేర స్మార్ట్‌ఫోన్ వినియోగస్తున్నట్లు సీఎంఆర్,వివో సర్వేలు చెబుతున్నాయి. సెల్ఫీలు తీసుకునే సమయం కూడా 14 నిమిషాల నుండి 18 నిమిషాలకు పెరిగింది.
స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎన్నో పనులు సులభంగా అవుతున్నప్పటికీ, చాలామంది అదే విధంగా ఫోన్ చూస్తూ సమయం వృధా చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. సెల్ ఫోన్ వినియోగం ఇలాగే పెరుగుతూ ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంమీద శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాలపై స్మార్ట్ ఫోన్ తనదైన ప్రభావాన్నే చూపిస్తోంది. స్మర్ట్ ఫోన్ అలవాటు రానున్న రోజుల్లో మరిన్ని రుగ్మతలకు దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.ప్రస్తుత సమాజం టెక్నాలజీకి తోనే అధికంగా నడుస్తుంది, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అవసరానికి తగినట్లుగా టెక్నాలజిని ఉపయోగిస్తే మంచిదే...కానీ అదే పనిగా ఇష్టాను సారంగా ఉపయోగిస్తే అనార్ధాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.