నూనె అధికంగా వాడుతున్నారా.. ఆ వ్యాధుల నుంచి ఎవ్వరూ కాపడలేరు..?

Oil Side Effects: మీరు ఆహారంలో ఎక్కువ నూనెను వాడుతున్నారా.. అయితే మీకు ముప్పు తప్పదు.

Update: 2022-03-01 04:30 GMT

నూనె అధికంగా వాడుతున్నారా.. ఆ వ్యాధుల నుంచి ఎవ్వరూ కాపడలేరు..?

Oil Side Effects: మీరు ఆహారంలో ఎక్కువ నూనెను వాడుతున్నారా.. అయితే మీకు ముప్పు తప్పదు. అది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను విపరీతంగా పెంచుతుంది. ఇది గుండెపోటు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్యలను నివారించడానికి ఉత్తమ మార్గం ఏంటంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకుంటే మంచిది.

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెకు సమీపంలో ఉన్న ధమనులలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తుంది. ఇది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడమే కాదు మనం రోజూ వ్యాయామం చేయాలి. లేదంటే కేలరీలు బర్నింగ్ కాక శరీరంలోని సిరల్లో కొవ్వు పేరుకుపోతుంది.కొలెస్ట్రాల్ పెరుగుదల లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది. యాంజియోగ్రఫీ గుండె ధమనులలో ఎంత కొవ్వు ఉందో చెబుతుంది. ఒకవేళ మీ మెదడులో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే మెదడు నరాలకు సంబంధించిన యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది.

శరీరంలో కొవ్వు పెరగకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ తినడం అలవాటు చేసుకోండి. దీనిని వైద్య భాషలో HDL కొలస్ట్రాల్ అంటారు. దీని వినియోగం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మాంసం ఉత్పత్తులు, వెన్న, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్‌, చీజ్, షుగర్‌లలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. సోయాబీన్స్, ఓట్స్, బీన్స్, కాయధాన్యాలు, నట్స్‌లలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News