సూపర్ మార్కెట్లో వస్తువులు కొంటున్నారా..! అయితే ఈ విషయం తెలుసా..
Supermarket: ప్రస్తుత రోజులలో వంటగదిలో ఉపయోగించే వస్తువులు సగానికి పైగా దుకాణం లేదా సూపర్ మార్కెట్లో కోనుగోలు చేసినవే
Supermarket: ప్రస్తుత రోజులలో వంటగదిలో ఉపయోగించే వస్తువులు, ఆహార పదార్థాలలో సగానికి పైగా దుకాణం లేదా సూపర్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినవే ఉంటాయి. ఇది రెడీమేడ్ ఫుడ్, కంపెనీ ద్వారా ప్యాకెట్లలో సీలు వేసి వస్తుంది. ఒకప్పుడు పండ్లు, కూరగాయలు ప్రాసెస్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఖరీదైన సూపర్ మార్కెట్లలో వాటిని ప్రాసెస్ చేస్తున్నారు. మన అవసరాల కోసం వీటిని కొనడంలో తప్పులేదు. కానీ ఒక్కసారి చూసి, కొన్ని విషయాలను పరిశీలించి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
లేబుల్స్ చదవడం అలవాటు ఉండదు..
మీరు ఎప్పుడైనా రెడీమేడ్ ప్యాక్ చేసిన వస్తువును షాప్ నుంచి కొనుగోలు చేసేటప్పుడు దాని లేబుల్ని తనిఖీ చేస్తారా. దానిపై ఏముందో చూస్తారా.. ఎవ్వరూ చూడరు. దీంతో వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా ప్రాసెస్ చూసిన ఫుడ్ కానీ ఇంకా మరేదైనా కానీ ఒక్కసారి కొనేటప్పుడు లేబుల్ చదవాలి. అందులో ఎన్ని కార్బోహైడ్రేట్, ఎంత ప్రోటీన్, ఎంత చక్కెర కలపారు, మినరల్, విటమిన్ మొదలైనవి గమనించాలి. ఏదైనా ఆహారం ప్రాసెస్ చేస్తే అది ఏ ప్రక్రియ ద్వారా ప్రాసెస్ చేశారో తెలుసుకోవాలి. ఇందులో ఏ రకమైన, ఎన్ని రకాల రసాయనాలు వాడుతున్నారో చదవాలి.
ఉదాహరణకు, పాలు, పెరుగు లేదా జున్ను తీసుకోండి. డైరీ ఐటమ్ అయినందున ఈ వస్తువులు పూర్తిగా షుగర్ ఫ్రీగా ఉంటాయని అనుకుంటాం. పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నందున అందులో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉండవు. కానీ చాలా కంపెనీలు జున్ను, పెరుగు మొదలైన వాటిలో చక్కెరను కలుపుతారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మార్కెట్లో ఏ రుచిగల పెరుగు అందుబాటులో ఉన్నా అందులో చాలా చక్కెర ఉంటుంది. సహజంగానే కార్బోహైడ్రేట్లు ఉండనే ఉంటాయి. దీనిని తింటే ఊబకాయం మొదలవుతుంది. మధుమేహ రోగులకు రక్తంలో ఇన్సులిన్ పెరుగుతుంది.
లేబుల్ని తప్పకుండా చదవండి
అందుకే ఏదైనా రెడీమేడ్, ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు దాని లేబుల్ని తప్పనిసరిగా చెక్ చేయడం ముఖ్యం. అనేక కీటో లేబుల్ ఉత్పత్తులు కూడా లోపల దాచిన చక్కెరను కలిగి ఉంటాయి. అందువల్ల ప్యాకెట్ పై సమాచారాన్ని చదవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంపెనీలు వినియోగదారులకు ఈ సమాచారం తెలియజేయాలి. ఏదైనా తేడా వస్తే వినియోగదారల కోర్టులో ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. అందరు ఈ విషయాలను గమనించాలి.