హైపోనట్రేమియా వ్యాధి గురించి మీకు తెలుసా..? ఇది ఎందుకు వస్తుంది..
* శరీరం సక్రమంగా నడవాలంటే సరిపడా నీరు అవసరం. * అధికంగా నీరు తీసుకున్నా ప్రమాదమే
Hyponatremia: శరీరం సక్రమంగా నడవాలంటే సరిపడా నీరు అవసరం. అందుకే వైద్యులు ప్రతిరోజు 5 లీటర్ల వరకు నీరు తాగాలని సూచిస్తారు. అంతేకాదు శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా నీరు సహాయపడుతుంది. కానీ అధికంగా నీరు తీసుకున్నా ప్రమాదమే అవును మీరు విన్నది నిజమే. నీరు తాగకుంటే ఎంత ప్రమాదమో అధికంగా నీరు తాగినా అంతే ప్రమాదం. అవసరానికి మించి నీరు తాగడం వల్ల హైపోనట్రేమియా సమస్య ఏర్పడుతుంది. ఇది మన శరీరం, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక విషయం దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
హైపోనాట్రేమియా అంటే రక్తంలో తక్కువ సోడియం గాఢత. సరళంగా చెప్పాలంటే శరీరంలో సోడియం లేకపోవడం. సోడియం చాలా ముఖ్యమైన మూలకం ఇది గుండె, కణాలు, మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి అవసరం. సోడియం మన శరీరంలోని కణాల చుట్టూ ఒక వృత్తాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఆ కణాల పనితీరుకు సహాయపడుతుంది. మనం అవసరానికి మించి నీరు తాగినప్పుడు ఆ నీటిలో సోడియం కలిసిపోయి కిడ్నీల ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ చాలా కాలం పాటు కొనసాగితే శరీరంలో సోడియం లోపం ఏర్పడుతుంది. అప్పుడు కణాలు క్రియారహితంగా మారి వ్యక్తి మరణానికి దారితీయవచ్చు.
హైపోనట్రేమియా లక్షణాలు
హైపోనట్రేమియా అంటే శరీరంలో తక్కువ సోడియం గాఢత ఇది అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వాటిని విస్మరించవద్దు.
1- తలనొప్పి లేదా మైగ్రేన్
2- ఆకలి లేకపోవడం
3- దీర్ఘకాలం, నిరంతర అలసట
4- తిన్న తర్వాత వాంతులు కావడం
5- తల తిరగడం
6- కూర్చున్నప్పుడు కూడా తల తిరుగుతున్నట్లు
అనిపించడం
7- భ్రాంతులు
8- జ్ఞాపకశక్తి క్షీణత
9. సాధారణ శరీరానికి 8 నుంచి10 లీటర్ల నీరు అధికం. ఇంతకు మించి తాగితే హానికరం.