50 ఏళ్ల వయసులో 30లా కనిపించాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి..!

Skin Care Tips: నేటి జీవనశైలి కారణంగా ప్రజలు వయసుకంటే ముందుగానే ముసలివారు అవుతున్నారు.

Update: 2023-01-25 01:30 GMT

50 ఏళ్ల వయసులో 30లా కనిపించాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి..!

Skin Care Tips: నేటి జీవనశైలి కారణంగా ప్రజలు వయసుకంటే ముందుగానే ముసలివారు అవుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మీరు తెలిసి చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సమస్యకి గురవుతున్నారు. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటే వృద్ధాప్యాన్ని ఆపవచ్చు. అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి కొన్ని చిట్కాలని పాటించాలి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సూర్యుని నుంచి చర్మాన్ని రక్షించండి

సూర్యుని నుంచి రక్షణ అవసరం. చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే ముఖాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించుకోవాలి. ముఖానికి రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్యకాంతి మీ చర్మంపై పడదు.

ధూమాపానం

ధూమపానం వయస్సును వేగంగా పెంచుతుంది. దీని కారణంగా చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో ముఖం బొద్దుగా, యవ్వనంగా కనిపించాలంటే వెంటనే ధూమపానానికి దూరంగా ఉండండి.

ప్రతిరోజూ వ్యాయామం

వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చర్మం యవ్వనంగా రోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం కచ్చితంగా అవసరం. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి.

ముఖం కడుక్కోవాలి

ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే దుమ్ము, ధూళి కారణంగా ముఖం డల్ గా కనిపిస్తుంది. కాబట్టి ఫేస్ వాష్ తో ముఖాన్ని రెండుసార్లు కడగాలి. రాత్రి పడుకునే ముందు ఎప్పుడూ ముఖం కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News