Health Tips: పాదాలలో నొప్పిగా ఉందా.. అయితే ఈ విటమిన్‌ లోపమే..!

Health Tips: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

Update: 2022-10-24 13:20 GMT

Health Tips: పాదాలలో నొప్పిగా ఉందా.. అయితే ఈ విటమిన్‌ లోపమే..!

Health Tips: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా లోపం ఉంటే శరీరం వదులుగా మారుతుంది. అయితే శరీరానికి ప్రతి విటమిన్ అవసరం. కానీ కొన్ని విటమిన్లు ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. మీరు పాదాల నొప్పితో బాధపడుతుంటే శరీరంలో విటమిన్ డి లోపం ఉందని అర్థం. ఇది కరిగే విటమిన్, ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. శరీరంలో కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అందుతుంది. అంతేకాదు సప్లిమెంట్లను ఉపయోగించడం ద్వారా కూడా ఈ విటమిన్‌ని పొందవచ్చు.

విటమిన్ డి లోపం

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు దెబ్బతింటాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్‌ డి లోపం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. నరాల సంబంధిత వ్యాధులు ఎదురవుతాయి. శరీరంలో విటమిన్ డి తగినంతగా లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్లు సంభవిస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తరచుగా అలసిపోయినట్టుగా అనిపిస్తే ఈ విటమిన్‌ లోపం అని అర్థం చేసుకోవాలి. శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల అలసట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శక్తి స్థాయి, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. జుట్టు పెరుగుదల సరిగా లేకపోయినా ఎక్కువగా రాలిపోతున్నా ఆహారంపై దృష్టి పెట్టండి. షాంపూలు, మందులు మారుస్తూ ఉండాలి. విటమిన్ డి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది లోపిస్తే శరీరం బలహీనమవుతుంది. విటమిన్ డి లోపం మానవులలో నిరాశకు కారణం అవుతుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Tags:    

Similar News