Health Tips: మొటిమల సమస్య ఎక్కువగా ఉందా.. ఈ మ్యాజిక్‌ డ్రింక్స్‌త్‌ చెక్‌ పెట్టండి..!

Health Tips: ముఖంపై మొటిమలు వస్తే తరువాత అవి నల్ల మచ్చలుగా మారుతాయి.

Update: 2023-03-07 01:30 GMT

Health Tips: మొటిమల సమస్య ఎక్కువగా ఉందా.. ఈ మ్యాజిక్‌ డ్రింక్స్‌త్‌ చెక్‌ పెట్టండి..!

Health Tips: ముఖంపై మొటిమలు వస్తే తరువాత అవి నల్ల మచ్చలుగా మారుతాయి. దీంతో అందమైన రూపం చెడిపోతుంది. కానీ దీనిగురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆహారం, పానీయాలలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. చాలామంది మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ని వాడుతారు. కానీ వీటివల్ల తాత్కాలిక ఉపశమనం తప్ప మరేది ఉండదు. ముఖంపై వచ్చే మొటిమల కోసం యాంటీ పింపుల్ డ్రింక్స్ తాగవచ్చు. వీటిని రోజూ తీసుకుంటే మొటిమలు, మచ్చలు త్వరగా తొలగిపోతాయి.

1. గ్రీన్ టీ, నిమ్మకాయ

గ్రీన్ టీ తరచుగా బరువు తగ్గించే పానీయంగా చెప్పవచ్చు. కానీ మీరు నిమ్మకాయతో తాగితే అది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తయారుచేసిన తర్వాత అందులో నిమ్మరసం పిండుకుని వడగట్టి తాగాలి. గ్రీన్ టీలో ఉండే ఆక్సిడెంట్లు, నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీని వల్ల మొటిమలు త్వరగా పోతాయి.

2. ఉసిరి, అల్లం

మెరుగైన జుట్టు ఆరోగ్యం కోసం ఉసిరిని ఉపయోగిస్తాం. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను కలిగించే జెర్మ్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఉసిరికాయ రసంలో అల్లం కలిపి తాగితే మచ్చలు తొలగిపోవడమే కాకుండా చర్మానికి అద్భుతమైన మెరుపు వస్తుంది.

3. వేప, తేనె

వేపలో ఉండ ఔషధ గుణాల గురించి అందరికి తెలుసు. ఈ చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వేప ఆకుల నుంచి యాంటీ బాక్టీరియల్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. మీరు దీనిని తాగితే మొటిమలు సహజంగా మాయమవుతాయి. వేప చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఆ పానీయంలో తేనె కలిపి తాగితే సరిపోతుంది.

Tags:    

Similar News