Health Tips: చలికాలంలో ఎండుద్రాక్ష, ఖర్జూర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్యంపై ఎఫెక్ట్..!
Health Tips: ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
Health Tips: ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటి ప్రభావం వేడిగా ఉండటం వల్ల శీతాకాలంలో ఎక్కువగా తింటారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ అధికంగా తింటే హానికరమే. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఇవి పని చేస్తాయి. కానీ ఏదైనా ఒక పరిధి వరకు మాత్రమే సరైనది. అధికంగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఖర్జూరం, ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
చక్కెర పెరుగుతుంది
ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఎండు ద్రాక్ష తినడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది. డయాబెటిస్ సమస్యలు ఎదురవుతాయి. షుగర్ పేషెంట్లు ఎండుద్రాక్ష తినకూడదు.
కాలేయం దెబ్బతింటుంది
ఎండుద్రాక్ష ఎక్కువగా తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. దీని కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎండుద్రాక్ష గ్యాస్‌కు కారణం అవుతుంది.
బరువు పెరగడం
నానబెట్టిన ఎండుద్రాక్ష బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. సన్నగా ఉన్నవారు తింటే ఫర్వాలేదు కానీ స్థూలకాయంతో బాధపడేవారు ఎండు ద్రాక్ష తినకూడదు.
ఖర్జూరం వల్ల అజీర్ణం
ఖర్జూరం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా చెబుతారు. కానీ ఎక్కువ ఖర్జూరాలు తినడం వల్ల అతిసారం వస్తుంది. ఇది కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది.
ఈ వ్యాధుల ప్రమాదం
ఖర్జూరం వల్ల కొంతమందికి అలర్జీ ఉంటుంది. వీటినిన ఎక్కువగా తినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. ఖర్జూరం తినడం వల్ల మధుమేహం సమస్య పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచడానికి పనిచేస్తుంది.