Health: వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌.. లేదంటే ప్రాణానికే ప్రమాదం..!

Health: వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌.. లేదంటే ప్రాణానికే ప్రమాదం..!

Update: 2022-07-19 14:30 GMT

Health: వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌.. లేదంటే ప్రాణానికే ప్రమాదం..!

Health Tips: వర్షాకాలంలో జ్వరం పెద్ద సమస్య. దీనివల్ల చాలామంది ఇబ్బందిపడుతుంటారు. ఈ సీజన్‌లో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరాలని ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కొంతవరకు నయమైనప్పటికీ కొన్నిసార్లు జ్వరం చాలా కాలం పాటు ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

మలేరియా

మలేరియా అనేది వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధి. ఆడ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ దోమ నిలిచిన నీటిలో పెరుగుతుంది. ఇది కుట్టడం వల్ల జ్వరంతో పాటు చలి, వణుకు, చెమటలు, శరీర నొప్పులు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మలేరియా పరీక్ష చేయించుకోవాలి. మలేరియాను గుర్తించడానికి ర్యాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ చేస్తారు.

టైఫాయిడ్

టైఫాయిడ్ అనేది వర్షాకాలంలో వచ్చే ఒక సాధారణ వ్యాధి. ఈ వ్యాధి కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. టైఫాయిడ్‌లో పగటిపూట జ్వరం ఎక్కువగా ఉంటుంది, ఉదయం శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

డెంగ్యూ

డెంగ్యూ అనేది ఆడ ఎడిస్ దోమ కాటు వల్ల వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో చాలా మంది ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య డెంగ్యూ జ్వరం. అధిక జ్వరంతో పాటు తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కళ్ల వెనుక నొప్పి, శరీరంలో నొప్పి లక్షణాలుగా ఉంటాయి. ఈ సమయంలో ఖచ్చితంగా డెంగ్యూ పరీక్ష చేయించుకోవాలి. ఇది అత్యంత ప్రమాదకరమైన జ్వరం.

Tags:    

Similar News