Milk: పాలలో వీటిని కలుపుకొని తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?
అయితే పాలలో కొన్ని రకాల పదార్థాలను కలుపుకొని అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. ముఖ్యంగా పాలలో ఉండే క్యాల్షియం చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే పాలలో కొన్ని రకాల పదార్థాలను కలుపుకొని అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ పాలలో కలుపుకోకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* మనలో కొందరు పాలలో చాక్లెట్ సిరప్‌ను కలుపుకొని తీసుకుంటుంటారు. మరీ ముఖ్యంగా చిన్నారులకు ఇలా ఇస్తుంటారు. అయితే ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పాలలో చాక్లెట్ సిరప్ కలిపి తాగడం వల్ల శరీరంలో రిఫైన్ చేయని కొవ్వులు పెరుగుతాయని అంటున్నారు. ఇది కూడా బరువు పెరగడానికి, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతాయి. అలాగే మరికొన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
* ఇక పాలలో చక్కెర కలుపుకొని తీసుకోవడం సర్వసాధారణమైన విషయమని తెలిసిందే. అయితే ఇలా తీసుకోవడం కూడా అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పాలల్లో పంచదార కలిపితే కేలరీలు మరింత పెరుతాయని అంటున్నారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే.. పంచదార కలయిక జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుందట. ఎసిడిటీ, మల బద్ధకం, డయేరియా, పైల్స్ లాంటి సమస్యలు దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు.
* పాలలో కాఫీ పౌడర్ కలుపుకొని తీసుకోవడం చాలా సాధారణమైన విషయం. అయితే పాలలో కెఫిన్ కలుపుకొని తాగడం వల్ల నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు, హార్డ్ బీట్ పెరగడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
* ఇటీవల చాలా మంది పాలలో ఆర్టిఫిషియల్ స్వీటనర్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ కృత్రి స్వీటనర్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా మంది భావిస్తుంటారు. అయితే వీటివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే స్వీట్‌నర్స్‌ను పాలలో కలుపుకొని తీసుకోకూడదని అంటున్నారు.