Health News: పరగడుపున ఈ పొరపాట్లు చేయకండి.. చాలా ప్రమాదం..!

Health News: పరగడుపున ఈ పొరపాట్లు చేయకండి.. చాలా ప్రమాదం..!

Update: 2022-03-18 10:00 GMT

Health News: పరగడుపున ఈ పొరపాట్లు చేయకండి.. చాలా ప్రమాదం..!

Health News: ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఎసిడిటీ, కడుపు నొప్పి, వాంతులు, బ్లడ్ షుగర్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయమే చాలా మంది ఆకలిని తీర్చుకోవడానికి ఏదో ఒకటి తింటారు. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఖాళీ కడుపుతో అస్సలు తినకూడనివి ఏంటో తెలుసుకుందాం. మీరు ఉదయం ఖాళీ కడుపుతో మద్యం తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల అది నేరుగా మీ రక్త ప్రవాహంలోకి వెళుతుంది. ఇది శరీరం అంతటా వ్యాపిస్తుంది. దీని వల్ల మన పల్స్ రేటు పడిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయంలో సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో ఎప్పుడు మద్యం తాగకూడదు.

అలాగే షాపింగ్ ఎప్పుడూ ఖాళీ కడుపుతో చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఆకలిని వదిలివేస్తాం. దీంతో కడుపులో గ్యాస్‌ సమస్యలు ఏర్పడుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా మంది కాఫీ తాగడం మొదలుపెడుతారు. దీనివల్ల ఎసిడిటీ సమస్యలు ఏర్పడుతాయి. చాలా మంది ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు. అలాంటి వారిలో మీరూ ఉంటే వెంటనే మానుకోండి. ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల పొట్టలో యాసిడ్స్‌ ఏర్పడుతాయి. ఈ యాసిడ్స్ ఎసిడిటీ నుంచి అల్సర్ల వరకు అనేక సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం మంచిది కాదు.

అలాగే టమోటాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ పచ్చి టమోటాలను పరగడుపున తినడం మంచిది కాదు. అందులో ఉండే సోర్ యాసిడ్ కడుపులో ఉన్న గ్యాస్ట్రోఇంటెస్టినల్ యాసిడ్‌తో కలిసి కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంటను పెంచుతుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే పరగడుపున కొన్ని తీపి పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో స్వీట్లు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రోజంతా అలసిపోయినట్లు ఉంటుంది. 

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News