Eating Fruits: పండ్లు తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి..! మంచిది కాదు..

Eating Fruits: ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో కచ్చితంగా పండ్లు ఉండాల్సిందే.. ప్రతిరోజు పండ్లు తింటే రోగాలు దరిచేరవు.

Update: 2021-12-30 03:00 GMT

 పండ్లు తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి..! మంచిది కాదు..

Eating Fruits: ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో కచ్చితంగా పండ్లు ఉండాల్సిందే. ప్రతిరోజు పండ్లు తింటే రోగాలు దరిచేరవు. రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఆయుష్షు పెరుగుతుంది. పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని నిత్య యవ్వనంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తినడం ఉత్తమం. అయితే ఈ పండ్లను మనం సరైన రీతిలో తినకపోతే నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలు తరచుగా ఇలాంటి అనేక పొరపాట్లు చేస్తారు. ఇది వారికి ప్రయోజనం కలిగించే బదులు హానికరం చేస్తుంది. పండ్లను తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి వాటిని ఎప్పుడైనా తినవచ్చని అనుకుంటారు. కానీ అలా కాదు. పండ్లను తినడానికి కూడా సమయం ఉంటుంది. ఉదయం ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. అరటి షేక్, యాపిల్స్ వంటివి ఉదయం తీసుకోవాలి. సిట్రస్ పండ్లు తరచుగా అసిడిటీకి కారణమవుతాయి. ఇందులో నారింజ, నేరేడు, నిమ్మజాతికి చెందిన పండ్లు ఉంటాయి. కొంతమంది పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అతిసారం లేదా కలరా వంటి తీవ్రమైన వ్యాధికి దారి తీస్తుంది. వాస్తవానికి పుచ్చకాయలో చాలా నీరు ఉంటుంది. ఈ కారణంగా వాటిని తిన్న తర్వాత నీరు తాగడానికి కాస్త సమయం తీసుకోవాలి.

చాలా మంది ప్రజలు పెరుగు లేదా పాలతో పండ్లను తినడానికి ఇష్టపడతారు. అయితే ఇది కూడా హానికరమే. ఈ పద్ధతి రుచికరమైనదిగా అనిపించినప్పటికీ దీని కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. పెరుగు, పండ్లు కలిపి తింటే అనేక ఉదర సమస్యలు ఏర్పడుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి పండ్లను తీసుకోకుండా ఉండాలి. ఇది వారికి ప్రయోజనం కలిగించే బదులు హాని కలిగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు పండ్ల ప్రభావాన్ని బట్టి మీకు ఏవైతే సరిపోతాయో వాటినే ఎంచుకోవాలి. లేదంటే అలర్జీ వంటి సమస్యలు కూడా రావొచ్చే.

Tags:    

Similar News