Leaving Salt: ఉప్పు తినడం మానేశారా.. ఈ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు..!

Leaving Salt: ఉప్పు వాడటం వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండు ఉన్నాయి.

Update: 2023-03-09 04:00 GMT

Leaving Salt: ఉప్పు తినడం మానేశారా.. ఈ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు..!

Leaving Salt: ఉప్పు వాడటం వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండు ఉన్నాయి. దీనిని అధికంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే అస్సలు వాడకపోవడం ఇంకా ప్రమాదకరం. ఈరోజుల్లో ఉప్పు వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని తెలిసి ఉప్పు తినడం మానుకుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదు. దీనివల్ల మరిన్ని సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉప్పులో శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ ఉంటుంది. అందుకే ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా మినహాయించవద్దు. ఉప్పు లేకపోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

కిడ్నీలో సమస్యలు

మీరు ఉప్పుకి దూరంగా ఉన్నట్లయితే దాని ప్రభావం నేరుగా కిడ్నీపై పడుతుంది. ఇది మీ రక్తపోటుని ప్రభావితం చేస్తుంది. వెంటనే కిలోల కొద్ది బరువు తగ్గుతారు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్‌ గారిని సంప్రదించాలి. ఉప్పును తీసుకోవ‌డం పూర్తిగా మానేయ‌కూడ‌దు. రోజులో తీసుకోవాల్సిన ఉప్పులో కాస్త త‌గ్గించి తీసుకోవాలి. శ‌రీరానికి త‌గినంత ఉప్పు లేక‌పోతే స్పృహ త‌ప్పి ప‌డిపోవ‌డం, త‌ల‌తిర‌గ‌డం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్ర‌కారం శ‌రీరానికి రోజుకు 2 గ్రాముల సోడియం అవ‌స‌రం. అంటే అది 5 గ్రాముల ఉప్పు ద్వారా ల‌భిస్తుంది. అంటే 1 టీస్పూన్ అన్న‌మాట‌. రోజుకు ఒక టీస్పూన్ మేర అయితే ఉప్పును తిన‌వ‌చ్చు. అంత‌కు మించ‌కుండా చూసుకోవాలి. ఇలా ఉప్పును రోజూ సుర‌క్షితమైన మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. కాబట్టి ఉప్పు తినడం మానేయాల‌ని చూస్తున్న‌వారు ఆ ఆలోచ‌నను విర‌మించుకోండి. రోజులో తీసుకునే ఉప్పు శాతాన్ని కాస్త తగ్గిస్తే సరిపోతుంది.

Tags:    

Similar News