Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తినకూడదు.. అబార్షన్ అయ్యే అవకాశాలు..?

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తినకూడదు.. అబార్షన్ అయ్యే అవకాశాలు..?

Update: 2022-02-01 06:11 GMT

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తినకూడదు.. అబార్షన్ అయ్యే అవకాశాలు..?

Pregnancy: తల్లిగా మారడం ఏ మహిళకైనా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇందుకోసం ఎంతో మంది మహిళలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తారు. గర్భందాల్చడం ఒక వరమేనే చెప్పాలి కానీ దానిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో అజాగ్రత్తగా ఉంటారు. దీంతో ఒక్కోసారి అబార్షన్ అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఆహారాలు ఏంటో చూద్దాం.

గర్భధారణ సమయంలో పచ్చి గుడ్లను అస్సలు తీసుకోకండి. ఇది సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో వికారం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గర్భధారణ సమయంలో బొప్పాయి తినకపోవడమే మంచిది. ముఖ్యంగా పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదు. నిజానికి పచ్చి బొప్పాయిలో పపైన్ అనే మూలకం ఉంటుంది. దీని కారణంగా కడుపులో పెరుగుతున్న పిండంలో పుట్టుకతో వచ్చే లోపాలు పెరుగుతాయి. అదనంగా, గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక కేలరీలు ఉన్న ఆహారాలు తినడం వల్ల గర్భిణులు బరువు పెరుగుతారు. దీంతో అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో స్త్రీలు ఉడకని మాంసం, సీఫుడ్, ప్రాసెస్ చేసిన మాంసం, ఎక్కువ వేయించిన ఆహారాలకి దూరంగా ఉండాలి. జలుబు సమస్య వచ్చినప్పుడు మహిళలు తరచుగా తులసి టీని తయారు చేసి తాగుతారు. లేదా వేరే విధంగానైనా తీసుకుంటారు. అయితే గర్భధారణ సమయంలో ఇలా చేయకండి. తులసి ఆకులలో ఈస్ట్రోగోల్ అనే మూలకం ఉంటుంది ఇది గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

Tags:    

Similar News