Cucumber Side Effects: ఈ సమయంలో దోసకాయ తినవద్దు.. లాభం కంటే నష్టమే ఎక్కువ..!
Cucumber Side Effects: దోసకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
Cucumber Side Effects: దోసకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని ఎక్కువగా సలాడ్‌లలో ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ చాలా మంది దీనిని తీసుకోవడంలో తప్పులు చేస్తారు. దోసకాయని తినడానికి సరైన సమయం తెలుసుకోవాలి. లేదంటే లాభాల కంటే నష్టాలని చవిచూడాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
వైద్యుల ప్రకారం.. దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎల్లప్పుడూ పగటిపూట మాత్రమే తినాలి. దీని వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే రాత్రిపూట తీసుకుంటే ప్రయోజనాలకు బదులుగా ప్రతికూలతలు ఉంటాయి. దోసకాయలో కుకుర్బిటాసిన్ ఉంటుంది. ఇది జీర్ణశక్తి బలంగా ఉన్నప్పుడు మాత్రమే జీర్ణమవుతుంది. లేదంటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలని సృష్టిస్తుంది. నిజానికి రాత్రిపూట దోసకాయ తినడం ద్వారా కడుపు బరువుగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం లేదా ఉబ్బరం సమస్య ఉంటుంది. కాబట్టి పగటిపూట మాత్రమే దోసకాయ తింటే మంచిది.
నిద్రపై ప్రభావం
మీరు రాత్రిపూట దోసకాయ తింటే నిద్ర పోవడం చాలా కష్టమవుతుంది. కడుపు మొత్తం ఉబ్బరంగా అనిపిస్తుంది. దోసకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున మీరు రాత్రిపూట మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది.
పగటిపూట దోసకాయ తినడం ఉత్తమం
చాలా మంది ఆరోగ్య నిపుణులు రోజులో దోసకాయ తినాలని సూచిస్తారు. ఎందుకంటే దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దోసకాయ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అందులో ఉండే వాటర్ ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. ఇది కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. క్యాన్సర్‌ను నివారించడం, ఎముకలను బలంగా చేయడంలో దోసకాయ బాగా ఉపయోగపడుతుంది.