Health Tips: దోసకాయ తిన్న తర్వాత అస్సలు ఈ పని చేయవద్దు.. చాలా సమస్యలు ఎదురవుతాయి..!
Health Tips: వేసవిలో మండే ఎండల వల్ల చాలామంది చల్లటి ఆహార పదార్థాలని తినాలని కోరుకుంటారు.
Health Tips: వేసవిలో మండే ఎండల వల్ల చాలామంది చల్లటి ఆహార పదార్థాలని తినాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఎక్కువ నీటి కంటెంట్ ఉన్న పండ్లను తినడానికి ఇష్టపడతారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దోసకాయ. ఎందుకంటే దీని ధర కూడా తక్కువగా ఉంటుంది. వాస్తవానికి దోసకాయలో చాలా నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. అయితే దోసకాయ తిన్న తర్వాత వెంటనే నీరు తాగడం మంచిది కాదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
దోసకాయ తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు?
దోసకాయ తిన్న తర్వాత నీరు తాగడం హానికరం. ఎందుకంటే దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. దీనిని తిన్న తర్వాత నీరు తాగడం వల్ల అందులో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేసే బదులు హాని చేస్తాయి. అందుకే దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.
పరగడుపున దోసకాయ
ఖాళీ కడుపుతో దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి పనిచేస్తుంది.
బరువు తగ్గడానికి
మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే దోసకాయ సహాయం తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. కానీ పరిమిత పరిమాణంలో దోసకాయను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
20 నిమిషాల గ్యాప్
దోసకాయ తింటే పొట్ట సమస్యలు తొలగిపోతాయి. కానీ దోసకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే లూజ్ మోషన్ సమస్యలు మొదలవుతాయి. దోసకాయ తినడానికి, నీరు తాగడానికి మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉండాలని గుర్తుంచుకోండి.