Zinc Deficiency: శరీరంలో జింక్‌లోపం ఉండకూడదు.. ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!
Zinc Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం.
Zinc Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం. ఇందులో ఏది లోపించినా వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలలో జింక్ ఒకటి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జింక్ లోపం వల్ల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అలాగే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే జింక్ బాగా లభిస్తుందో ఈరోజు తెలుసుకుందాం.
1. గుడ్డు పచ్చసొన
కోడిగుడ్డుని తరచుగా మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటాము. కానీ జిమ్‌కి వెళ్లే వ్యక్తులు ఇందులోని పచ్చసొనను తినడం మానేస్తారు. జింక్‌కు సంబంధించిన పచ్చసొన రిచ్ సోర్స్ అని గుర్తుంచుకోవాలి. విటమిన్ B12, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్, పాంథోనిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఇందులో అధికంగా ఉంటాయి.
2. వెల్లుల్లి
వెల్లుల్లి భారతీయ ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే మసాలా వస్తువు. ఇందులో జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లి ప్రభావం వేడిగా ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
3. పుచ్చకాయ గింజలు
సాధారణంగా మనం పుచ్చకాయను ఇష్టంగా తింటాము కానీ ఈ పండు గింజలను డస్ట్‌బిన్‌లో వేస్తాము. అయితే ఈ గింజల ప్రయోజనాలు తెలిస్తే మీరు అలా చేయరు. ఈ పండు విత్తనాలలో జింక్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. పుచ్చకాయ గింజలను కడిగి ఎండలో ఆరబెట్టి ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.
జింక్ లోపం లక్షణాలు
బరువు తగ్గడం, ఆలస్యం గాయం మానడం, అతిసారం, ఆకలి లేకపోవడం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, చాలా బలహీనంగా అనిపించడం, జుట్టు రాలడం, రుచి వాసన తగ్గడం వంటివి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.