White Hair: హైబీపీ పేషెంట్లకి తొందరగా తెల్లజుట్టు వస్తుందా..?
White Hair: తెల్ల జుట్టు, అధిక రక్తపోటు ప్రస్తుత యుగంలో చాలా పెద్ద సమస్యలు.
White Hair: తెల్ల జుట్టు, అధిక రక్తపోటు ప్రస్తుత యుగంలో చాలా పెద్ద సమస్యలు. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఇలాంటి రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బీపీ పెరగడానికి కారణం అధిక కొలెస్ట్రాల్.. అలాగే మెలనిన్ లేకపోవడం వల్ల జుట్టు నెరుస్తుంది. అయినప్పటికీ ఈ రెండింటికి కారణాలు సరైన జీవనశైలి లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు.
రక్తపోటు అదుపులో ఉండకపోతే గుండెపోటు, పక్షవాతం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బీపీ పెరిగితే జుట్టు తెల్లబడే అవకాశాలు ఉన్నాయి. బీపీ 120/80 నుంచి 129/80 mm Hg కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితిలో గుండె జబ్బులు ప్రమాదం మొదలవుతుంది. ఇది పురుషులలో బట్టతల, అకాల జుట్టు నెరిసేందుకు కారణమవుతుంది.
అధిక రక్తపోటు వల్ల మహిళల కంటే పురుషులలో తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉంటుంది. గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు నిరంతరం కొట్టుకుంటుంది. కాబట్టి గుండెను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. మీరు కొవ్వు ఆహారాన్ని తినడం మానేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే శారీరక శ్రమలపై శ్రద్ధ వహిస్తే మంచిది.