నిమ్మరసం మంచిదే.. కానీ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
నిమ్మరసం మంచిదే.. కానీ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
Health Tips: ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విధ్వంసం సృష్టించిందో అప్పటి నుంచి అందరు రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టి సారించారు. తద్వారా ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. దీని కోసం ప్రజలు నిమ్మకాయ వినియోగాన్ని పెంచారు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటారు. మీరు విచక్షణారహితంగా నిమ్మరసం తాగితే హానికరం. నిమ్మకాయను అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
1. టాన్సిల్స్ సమస్య
మీరు నిమ్మకాయ నీటిని అవసరానికి మించి తీసుకుంటే గొంతుకు హాని కలుగుతుంది. ఎందుకంటే పుల్లని ఆహారాలు ఎక్కువ తినడం వల్ల గొంతు నొప్పి, టాన్సిల్స్ సమస్య వస్తుంది.
2. దంతాలకు నష్టం
నిమ్మకాయలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని దంతాలను శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. కానీ మితిమీరిన ఉపయోగం దంతాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే నిమ్మరసం ఎనామెల్‌ను పాడు చేస్తుంది. అందువల్ల మీరు నిమ్మకాయతో చేసిన ఉత్పత్తిని తీసుకుంటే వెంటనే టూత్ బ్రషింగ్‌కు దూరంగా ఉండాలి.
3. అజీర్ణం
నిమ్మరసం తరచుగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఒక మార్గం. కానీ మీరు నిమ్మరసం ఎక్కువగా తాగితే అది వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి వ్యాధులు వస్తాయి. మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తీవ్రమైన పరిస్థితుల్లో వాంతులు సంభవించవచ్చు.