Cholesterol: కొలస్ట్రాల్ పెరగకూడదంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!

Cholesterol: కొలస్ట్రాల్ పెరగకూడదంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!

Update: 2022-03-22 08:00 GMT

Cholesterol: కొలస్ట్రాల్ పెరగకూడదంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!

Cholesterol: సమయపాలన లేని జీవనశైలి కారణంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొలస్ట్రాల్‌ నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారింది. పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఎందుకంటే బయట తినడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇది కాకుండా మీ ఆహారంలో పోషకమైన ఆహారాన్ని చేర్చాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

మీడియా నివేదికల ప్రకారం.. క్రమరహితమైన ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. 100 మందిలో 98 మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి అందరికి పెద్ద సమస్యగా మారింది. అందుకే చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు.

వాస్తవానికి ఎక్కువగా వేయించిన ఆహారాలని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా పెరగకూడదంటే కొన్ని ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా బి12 కంటెంట్ ఉన్న ఆలివ్ ఆయిల్, నట్స్ వంటి ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచివి. రెడ్ మీట్‌లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తినకపోవడమే మంచిది. ఉదయం అల్పాహారంలో ఓట్స్ తినండి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో చేర్చండి. ఇది మీ శరీర కొవ్వును కంట్రోల్ చేస్తుంది. గ్రీన్ టీ అన్ని విధాలుగా శరీరాన్ని కాపాడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News