టెన్షన్, డిప్రెషన్ తగ్గడానికి ఆ ట్యాబ్లెట్ వాడుతున్నారా.. చాలా ప్రమాదం..?
Diclofenac: ఆధునిక కాలంలో బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు...
Diclofenac: ఆధునిక కాలంలో బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కలుషితమైన ఆహారం, జీవన పరిస్థితుల వల్ల తరచూ టెన్షన్, డిప్రెషన్‌కు గురవుతున్నారు. వీటినుంచి తప్పించుకోవడానికి విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. వీటివల్ల తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ ధీర్ఘకాలికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టాబ్లెట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
డైక్లోఫెనాక్ అనే జెనరిక్ ఔషధం వాడకం వల్ల గుండెపోటు వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై ఓ అధ్యయనం హెచ్చరించింది. BMJలో ప్రచురించిన పరిశోధన, పారాసెటమాల్, ఇతర సంప్రదాయ ఔషధాల నివారణ మందులతో డైక్లోఫెనాక్ వాడకాన్ని పోల్చింది. దీంతో ఇది చాలా ప్రమాదకరమని తేలింది. డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు డైక్లోఫెనాక్ సాధారణ అమ్మకానికి అందుబాటులో ఉండకూడదని హెచ్చరించింది.
ఒకవేళ దీనిని విక్రయిస్తే దాని ప్యాకెట్ పై భాగంలో దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలియజేయాలని సూచించింది. Diclofenac అనేది సంప్రదాయక నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. దీనిని నొప్పి, వాపు చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్నారు. ఈ పరిశోధనలో ఇతర NSAID మందులు, పారాసెటమాల్‌ను ఉపయోగించే వారితో పోల్చితే డైక్లోఫెనాక్‌ను వాడే వ్యక్తులలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.