Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ రైస్‌ చాలా బెటర్‌.. ఎందుకంటే..?

Health Tips: డయాబెటీస్‌ ఉన్న వ్యక్తులు ఏది తినాలో ఏది తినకూడదో తెలియని పరిస్థితులలో ఉంటారు.

Update: 2022-07-19 01:30 GMT

Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ రైస్‌ చాలా బెటర్‌.. ఎందుకంటే..?

Health Tips: డయాబెటీస్‌ ఉన్న వ్యక్తులు ఏది తినాలో ఏది తినకూడదో తెలియని పరిస్థితులలో ఉంటారు. చాలామంది అన్నం తినడం మానుకోవాలని సలహా ఇస్తారు. దీనికి కారణం బియ్యంలో పిండి పదార్థాలు, స్టార్చ్ పుష్కలంగా ఉండటం. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కానీ కొంతమందికి అన్నం అంటే చాలా ఇష్టం. అది వదిలేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి వారు ఏం చేయాలో తెలుసుకుందాం.

డయాబెటిక్ రోగులకి బ్లాక్ రైస్ ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు. వీటిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) స్థాయిని నియంత్రిస్తాయి. బ్లాక్ రైస్‌లో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్ ప్లాంట్ పిగ్మెంట్స్ కారణంగా ఇవి నలుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. ఆంథోసైనిన్‌లు కావడం వల్ల ఇవి ఫైన్ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు సెల్ డ్యామేజ్‌ను నిరోధించడానికి, మంటను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. వీటిలో ఫైబర్ ఉండటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది. ఇది కాకుండా బరువు పెరగకుండా చేస్తుంది. డయాబెటిక్ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి బ్లాక్‌ రైస్‌ దివ్య ఔషధం అని చెప్పాలి. ధమనులలో రక్త సరఫరాను సాధారణంగా చేసే ఆంత్రాసిన్ ఇందులో ఉంటుంది. ప్రొటీన్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

Tags:    

Similar News