Diabetes: ఈ పదార్థాల వల్ల డయాబెటిక్‌ రోగులకి చాలా ప్రమాదం..!

Diabetes: డయాబెటిక్ రోగులకు తీపి పదార్థాలు విషంతో సమానం.

Update: 2022-09-04 16:00 GMT

Diabetes: ఈ పదార్థాల వల్ల డయాబెటిక్‌ రోగులకి చాలా ప్రమాదం..!

Diabetes: డయాబెటిక్ రోగులకు తీపి పదార్థాలు విషంతో సమానం. ఎందుకంటే దీని కారణంగా గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉండదు. అంతేకాదు ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తలెత్తుతాయి. డయాబెటిక్ రోగులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. కానీ కొంతమంది తినడానికి కోరికను నియంత్రించుకోలేరు. తినకూడని పదార్థాలని తింటారు. ఇది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. డయాబెటిక్ రోగి కొన్ని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

1. మనలో చాలామంది పాలలో చాక్లెట్ సిరప్ కలుపుకొని తాగడానికి ఇష్టపడతారు. కానీ ఈ అలవాటు డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదం. చాక్లెట్ మిల్క్‌లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.

2.పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో రుచిగల పెరుగుకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచడానికి పనిచేస్తుంది.

3. కాఫీలో కెఫిన్ ఉన్నందున రక్తపోటును పెంచుతుంది. అందుకే కాఫీని ఎక్కువగా తాగకూడదని సలహా ఇస్తారు. కొంతమందికి ఫ్లేవర్డ్ కాఫీ తాగడం ఇష్టం కానీ అందులో దాగి ఉన్న షుగర్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు.

4. తాజా పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. అయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచే కొన్ని పండ్లు ఉంటాయి. మామిడి, పైనాపిల్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్‌ పేషెంట్లు ఈ పండ్లకి దూరంగా ఉండాలి.

Tags:    

Similar News