Diabetes Patients: షుగర్ పేషెంట్లు ఈ పండ్లకు దూరంగా ఉండాలి.. లేదంటే ప్రమాదంలో పడుతారు..!

Diabetes Patients: పండ్లు తియ్యగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Update: 2024-05-06 11:30 GMT

Diabetes Patients: షుగర్ పేషెంట్లు ఈ పండ్లకు దూరంగా ఉండాలి.. లేదంటే ప్రమాదంలో పడుతారు..!

Diabetes Patients: పండ్లు తియ్యగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు మాత్రం ఏ పండ్లు తినాలో తెలియక తికమకపడుతుంటారు. నిజానికి పండ్లలో చక్కెర ఉంటుంది వీటిని తినడం వల్ల బాడీలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయపడుతుంటారు. అయితే అన్ని పండ్లు ఒకే మాదిరి ఉండవు. కొన్నింటిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి మరికొన్నింటిలో తక్కువగా ఉంటాయి. అయితే షుగర్ పేషెంట్లు తినే పండ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే డాక్టర్లు ఏ పేషెంట్ కైనా పండ్లు ఎక్కువగా తినమని సలహా ఇస్తారు. వీటిని తినడం వల్ల వారు తొందరగా కోలుకుంటారు. ఎండా కాలంలో మామిడిపండ్లు ఎక్కువగా లభిస్తాయి. అయితే షుగర్ పేషెంట్లు వీటిని తక్కువగా తీసు కోవాలి. ఎందుకంటే మిగతా పండ్లతో పోలిస్తే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధి గ్రస్తు లు మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా మామిడి పండ్లను ఎక్కువ మోతాదులో తినకూడదు.

అదేవిధంగా ద్రాక్షలో కూడా చక్కెర అధికంగా ఉంటుంది. ఒక కప్పు ద్రాక్ష పండ్లలో 23 గ్రాముల వరకు చక్కెర ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ద్రాక్ష పండ్లు తినే విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక పుచ్చ కాయ, చెర్రీ పండ్లు, పియర్ పండు, అరటి పండ్లలో కూడా కొంచె చక్కెర శాతం ఎక్కువగానే ఉంటుంది. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాము ల చక్కెర ఉంటుంది. ఒక మీడియం సైజ్ పుచ్చకాయ ముక్కలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక పియర్ పండు లో కూడా 17 గ్రాముల చక్కెర ఉంటుందట. 1 అరటిపండులో 14 గ్రాములు చక్కెర ఉంటుంది. ఈ పండ్లలో ఎక్కువగా చక్కెర ఉంటుంది కాబట్టి పరిమిత మోతాదులో తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News