Health News: షుగర్‌ పేషెంట్లు వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే చాలా ప్రమాదం..!

Health News: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది...

Update: 2022-04-08 09:30 GMT

Health News: షుగర్‌ పేషెంట్లు వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే చాలా ప్రమాదం..!

Health News: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. షుగర్ రోగులు వారి ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. చాలా మంది మంచి ఆరోగ్యాన్ని పొందడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. కానీ కొన్ని గింజలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అలాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.

1. ఖర్జూర

ఖర్జూరలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో డయాబెటిక్ పేషెంట్లు ఖర్జూరం తినడం మానుకోవాలి.

2. ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో గ్లూకోజ్ పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా శరీరంలో గ్లూకోజ్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో డయాబెటిక్ రోగులు ఎండుద్రాక్షను తినకూడదు.

3. వైట్ బ్రెడ్

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం, పానీయాలపై చాలా శ్రద్ధ వహించాలి. ఈ పరిస్థితిలో వైట్‌ బ్రెడ్‌ తినకూడదు. ఇందులో పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది.

4. సపోట

మధుమేహ వ్యాధిగ్రస్తులు సపోటా పండ్లని తినకూడదు. ఈ పండు చాలా తీపిగా ఉంటుంది. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు తినకూడదు.

5. బంగాళదుంపలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. బంగాళదుంపలు ఎక్కువగా తినడం షుగర్ పేషెంట్లకు హానికరం. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News