Diabetes: రక్తంలో చక్కెర అదుపులో ఉండాలంటే ఈ పండ్లు తప్పనిసరి..!

Diabetes: రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉండాలంటే మాత్రం కొన్ని రకాల పండ్లను తినాలని వైద్యులు చెబుతున్నారు.

Update: 2021-11-17 11:30 GMT

Diabetes: రక్తంలో చక్కెర అదుపులో ఉండాలంటే ఈ పండ్లు తప్పనిసరి..!

Diabetes: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటారు. వీరు ఎటువంటి తియ్యటి పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా చక్కెరకి దూరంగా ఉండాలి. అయితే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉండాలంటే మాత్రం కొన్ని రకాల పండ్లను తినాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వారి తీపి కోరికను నెరవేర్చుకోవచ్చు అలాగే షుగర్‌ లెవల్స్‌ కూడా నిలకడగా ఉంటాయి. ముఖ్యంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ తినడం వల్ల చక్కెర, వాపు స్థాయిలను తగ్గించడం నుంచి అధిక రక్తపోటుతో పోరాడటం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో ఏయే పండ్లను చేర్చుకోవాలో తెలుసుకుందాం.

1. ఆపిల్

రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. ఇది నిజమే. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది సర్వరోగనివారిణిగా చెప్పవచ్చు. వాటిని మితంగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

2. అవకాడో

అవోకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాల గొప్ప మూలం. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. బొప్పాయి

బొప్పాయిలో సహజ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక. ఇది భవిష్యత్తులో సెల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. పండులో ఫ్లేవనాయిడ్స్ వంటి సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

4. బెర్రీలు

డయాబెటిస్-ఫ్రెండ్లీ డైట్‌లో వెరైటీని జోడించడానికి బెర్రీలు చేర్చడం ఉత్తమ మార్గాలలో ఒకటి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తాయి.

5. సీతాఫలాలు

మధుమేహం ఉన్నవారు సీతాఫలం, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ పండ్లను తినడం మంచిది. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B, C వంటి అనేక పోషక ప్రయోజనాల కోసం మితంగా తినాలి.

6. పియర్

బేరిపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటతో పోరాడటానికి సహాయం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అధ్యయనాల ప్రకారం బేరి వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

7. నారింజ

నారింజ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలో చక్కెర శోషణను మందగించడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఎ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా ఉంటాయి.

Tags:    

Similar News