Danger Fever: డేంజర్ జ్వరం.. మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే పరిస్థితి విషమం..!
Danger Fever: డెంగ్యూ వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు పాటించాలి.
Danger Fever: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో ప్రమాదకరమైన జ్వరాలు అధికంగా వస్తాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉంది. వర్షం కారణంగా చాలా చోట్ల నీరు నిండిపోతుంది. దీంతో దోమల బెడద ఎక్కువవుతుంది. దీంతో తక్కువ రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. డెంగ్యూ వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు పాటించాలి.
డెంగ్యూ లక్షణాలు మొదట్లో స్వల్పంగానే ఉంటాయి. ముందుగా జ్వరం వచ్చి తర్వాత ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ఈ జ్వరం చాలా రోజుల పాటు కొనసాగుతుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. జ్వరంతో పాటు శరీరంలో దద్దుర్లు రావడం మొదలవుతాయి. ఇలాంటి లక్షణాలని అస్సలు విస్మరించకూడదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. కొన్ని జాతుల దోమలు చాలా ప్రమాదకరమైనవి. ఒకసారి డెంగ్యూ సోకిన వ్యక్తికి మరోసారి కూడా డెంగ్యూ వస్తుంది. రెండవసారి కొత్త జాతి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి డెంగ్యూ వస్తే మళ్లీ రాదని అనుకోవద్దు.
డెంగ్యూ షాక్ సిండ్రోమ్
డెంగ్యూ కారణంగా రోగులకు షాక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో రోగికి శరీరం చల్లగా ఉంటుంది. బిపి అకస్మాత్తుగా పెరుగుతుంది. మూర్ఛపోవడం జరుగుతుంది. అనేక అవయవాలలో రక్త ప్రసరణ తగ్గుతుంది. శరీరంలో వణుకు మొదలవుతుంది. చాలా మంది రోగులలో హెమటోక్రిట్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో సకాలంలో చికిత్స అందించకపోతే రోగి మరణిస్తాడు. డెంగ్యూ జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని గుర్తుంచుకోండి.