Baldness: ఈ పోషక లోపం వల్ల బట్టతల వచ్చేస్తుంది.. చాలా మంది గమనించారు..!

Baldness: నేటి కాలంలో జుట్టురాలడం అతిపెద్ద సమస్య. ఆడ, మగ అనే తేడాలేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-12-09 14:30 GMT

Baldness: ఈ పోషక లోపం వల్ల బట్టతల వచ్చేస్తుంది.. చాలా మంది గమనించారు..!

Baldness: నేటి కాలంలో జుట్టురాలడం అతిపెద్ద సమస్య. ఆడ, మగ అనే తేడాలేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగుతూ బట్టతల వచ్చేస్తుంది. దీంతో చాలామంది బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని యువత ఈ సమస్యతో మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. 20 నుంచి 25 సంవత్సరాల వయస్సులో ఈ సమస్య ఎదురైనట్లయితే మీ శరీరంలో పోషకాల లోపం ఉందని అర్థం చేసుకోవాలి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు

నేటి బిజీ లైఫ్‌లో ఆహారంపై శ్రద్ధ పెట్టడం లేదు. కుటుంబ బాధ్యతల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది. జింక్ లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు ఆరోగ్యానికి విటమిన్ డి, ఐరన్ చాలా ముఖ్యం. ఈ ఖనిజం లోపం ఉంటే జుట్టు రాలడం వేగంగా జరుగుతుంది. ఇందుకోసం మీకు ప్రతిరోజూ 11 mg జింక్ అవసరం. జింక్ పుష్కలంగా లభించే ఆహారాల గురించి తెలుసుకుందాం.

వేరుశెనగలు

జుట్టు వేగంగా రాలిపోతుంటే వెంటనే వేరుశెనగ తినడం ప్రారంభించండి. ఎందుకంటే ఇందులో జింక్‌తో పాటు విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

చిక్కుళ్లు

శరీరంలో జింక్ లోపం లేకుండా చూసుకోవడానికి రోజువారీ ఆహారంలో చిక్కుళ్లు చేర్చుకోవాలి. దీనివల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ రోజు నుంచే బఠానీలు, బీన్స్, కాయధాన్యాలు, శెనగలు తినడం ప్రారంభించండి.

పుట్టగొడుగులు

పుట్టగొడుగులు ఖరీదైన ఆహారం కావచ్చు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టుకు జింక్ ని అందిస్తుంది. ఇది కాకుండా ఈ సూపర్‌ఫుడ్‌లో ప్రోటీన్, పొటాషియం, భాస్వరం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు రాలకుండా నివారిస్తాయి.

Tags:    

Similar News