Low Vision Problem: కంటిచూపు మసకబారిందా.. ఎ విటమిన్‌తో పాటు ఇది కూడా లోపించినట్లే..!

Low Vision Problem:ఆధునిక జీవనశైలి, ఆహారపు విధానాలలో మార్పులు రావడం వల్ల చాలా మందికి కంటిచూపు మసకబారుతోంది.

Update: 2023-09-06 09:41 GMT

Low Vision Problem: కంటిచూపు మసకబారిందా.. ఎ విటమిన్‌తో పాటు ఇది కూడా లోపించినట్లే..!

Low Vision Problem: ఆధునిక జీవనశైలి, ఆహారపు విధానాలలో మార్పులు రావడం వల్ల చాలా మందికి కంటిచూపు మసకబారుతోంది. దీనికి కారణం పోషకాహార లోపం అలాగే కళ్లకి అవసరమయ్యే విటమిన్లు సరిగ్గా అందకపోవడం. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి అవసరం. ఒకవేళ ఈ విటమిన్‌ లోపిస్తే కంటిచూపు తగ్గుతుంది. ధూమపానం చేయడం, మద్యం తాగడం, మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే శరీరంలో విటమిన్ సి లోపం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి.

సాధారణంగా పురుషులకు 90 mg, స్త్రీలకు 75 mg విటమిన్ సి అవసరం. ఇది అందకపోతే శరీరంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కళ్ళని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ విటమిన్ సి తీసుకుంటే కంటిశుక్లం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ విటమిన్ సి లోపం ఉన్నట్లయితే కళ్ళకు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.

విటమిన్ సి లోపం లక్షణాలు

1. పొడి, చీలిపోయిన వెంట్రుకలు

2. గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పట్టడం

3. రక్తహీనత (రక్త లోపం)

4. చిగుళ్ళలో రక్తస్రావం

5. పొడి, పొలుసుల చర్మం

6. కీళ్ల నొప్పులు

7. దంతాలు బలహీనపడటం

8. జీవక్రియ కార్యకలాపాలు మందగించడం

9. ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం తగ్గిపోవడం

విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధులు

1. చాలా మందికి స్కర్వీ వ్యాధి వస్తుంది.

2. బలహీనత, అలసట ఉంటుంది

3. దంతాలు వదులుగా మారుతాయి.

4. గోళ్లు బలహీనంగా మారతాయి.

5. కీళ్లలో నొప్పి ఉంటుంది.

6. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు

1. ఉసిరి

2. ఆరెంజ్

3. నిమ్మకాయ

4. ఆరెంజ్

5. ద్రాక్ష

6. టమోటో

7. యాపిల్

8. అరటి

9. రేగు

Tags:    

Similar News