Curd Benefits: పెరుగులో వీటిని కలుపుకొని తింటే ఈ రోగాలు నయం..!

Curd Benefits: పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది...

Update: 2022-04-24 06:36 GMT

Curd Benefits: పెరుగులో వీటిని కలుపుకొని తింటే ఈ రోగాలు నయం..!

Curd Benefits: పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో కొన్ని పదార్థాలు కలుపుకొని తినడం వల్ల కొన్ని వ్యాధులు నయమవుతాయి. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు లాక్టోస్, ఐరన్, ఫాస్పరస్ కూడా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగుతో కొన్ని పదార్థాలను కలిపి తింటే ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

1. పెరుగు, జీలకర్ర

పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే మీరు పెరుగుతో జీలకర్ర తీసుకోవాలి. దీని ద్వారా బరువు తగ్గుతారు. ఇందుకోసం మీరు జీలకర్రను కాల్చి, ఆ తర్వాత పెరుగులో కలుపుకొని తినాలి.

2. పెరుగు చక్కెర

పెరుగు, చక్కెర కూడా మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కఫం సమస్య తొలగిపోతుంది. దీంతో పాటు మీ శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

3. పెరుగు, రాతి ఉప్పు

సాధారణంగా ఉపవాస సమయంలో పెరుగు, రాతిఉప్పు కలుపుకొని తింటారు. ఈ రెండిటినీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుందని నిపుణులు భావిస్తారు.

4. పెరుగు, సోంపు

పెరుగు, సోంపు గింజలు మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. దంతాల నొప్పి గురించి సమస్య ఉంటే ఈ రెండింటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది నోటిలోని అల్సర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

5. పెరుగు, నల్ల మిరియాలు

మీరు పెరుగు, నల్ల మిరియాలు నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందుకోసం మూడు చెంచాల పెరుగులో రెండు చెంచాల మిరియాల పొడిని కలపి పేస్ట్ సిద్ధం చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి గంటసేపు ఉంచండి. ఆపై జుట్టును కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

Tags:    

Similar News