Mattresses: అప్పుడప్పుడు పరుపులని కూడా పట్టించుకోండి.. లేదంటే తప్పదు ముప్పు..!
Mattresses: ఇంటిని శుభ్రం చేయడంతో పాటు ఇంట్లోని వస్తువులని శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
Mattresses: ఇంటిని శుభ్రం చేయడంతో పాటు ఇంట్లోని వస్తువులని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కానీ చాలామంది పట్టించుకోని విషయాలు కొన్ని ఉన్నాయి. వీటిలో ఒకటి మంచంపై ఉండే పరుపులు. వీటిని పట్టించుకోకపోవడంతో కీటకాలు చేరి వివిధ రకాల వ్యాధులకి కారణం అవుతాయి. ఇవి దుప్పట్లని తర్వాత మంచాన్ని నాశనం చేస్తాయి. దీంతోపాటు అనేక రకాల వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ రోజు పరుపులని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. పరుపులను శుభ్రంగా ఉంచేందుకు పుదీనాను ఉపయోగించవచ్చు. దీని వాసనకి బెడ్‌బగ్స్ మాయమవుతాయి. దీని కోసం పరుపును తీసి మొత్తం మంచం మూలల్లో పుదీనా ఆకులను ఉంచాలి. దీంతో పుదీనా వాసన వ్యాపించి అందులోని క్రిమికీటకాలు నశిస్తాయి.
2. దుప్పట్లను కీటకాలు, తేమ నుంచి రక్షించడానికి ఉత్తమ మార్గం ఎండలో ఆరబెట్టడం. దీని కోసం సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో పరుపును, దుప్పట్లని ఉంచాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల అందులోని క్రిములు నశిస్తాయి.
3. ఎసీ లేదా గదిలోని తేమ కారణంగా కొన్నిసార్లు చిన్న చిన్న కీటకాలు పరుపులో చిక్కుకుంటాయి. వీటి వల్ల ఫంగస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని నివారించడానికి, పరుపులను రక్షించడానికి నాఫ్తలీన్ బాల్స్‌ను ఉపయోగించవచ్చు. పరుపు కవర్‌లో కొన్ని నాఫ్తలీన్ బాల్స్ ఉంచాలి.
4. కీటకాల నుంచి పరుపును రక్షించడానికి వేప ఆకులను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కీటకాలను పరుపులోకి ప్రవేశించనివ్వవు. ఇందుకోసం వేప తాజా ఆకులను రుద్ది గుండ్రంగా చేసి పరుపు కవర్లో వివిధ భాగాలలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల పరుపు, మంచం రెండూ సురక్షితంగా ఉంటాయి.